CS Sanjay Jaju | పారిశ్రామిక అభివృద్ధికి రహదారి కనెక్టివిటీ కీలకం
CS Sanjay Jaju | పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన రహదారి కనెక్టివిటీ ఎంతో కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణంతో పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
- రేడియల్ రోడ్లతో రవాణా సౌకర్యాలు మెరుగుపడతయ్
- పెట్టుబడుల ఆకర్షణకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
CS Sanjay Jaju | పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన రహదారి కనెక్టివిటీ ఎంతో కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణంతో పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో సీఎస్ పర్యటించారు. అక్కడి సీటీఆర్‌ఎల్‌ఎస్, వెల్స్‌పన్ పారిశ్రామిక యూనిట్లను సందర్శించారు. ఆయా సంస్థల కార్యకలాపాలు, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్ అవసరాలు, ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలపై సంస్థల ప్రతినిధులతో చర్చించారు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన రవాణా, రహదారి సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం హైతాబాద్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రేడియల్ రోడ్ నంబర్-2 పనులను పరిశీలించారు. ముఖ్యంగా 20.50 కిలోమీటర్ చైనేజీ వద్ద జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతి, సాంకేతిక అంశాలు, ప్రస్తుత స్థితిగతులపై ఇంజినీరింగ్ అధికారులను ఆరా తీశారు. పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు పరిశ్రమల కార్యకలాపాలు వేగవంతమవుతాయని సీఎస్ తెలిపారు. సరకు రవాణా సులభతరమై పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తద్వారా కొత్త పెట్టుబడులకు అవకాశాలు పెరిగి ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ పర్యటనలో ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, ఆర్డీవో పార్థ సింహారెడ్డి, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, తహసీల్దార్, పరిశ్రమల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TG Oilfed | ఆయిల్‌పామ్‌లో టీజీ ఆయిల్‌ఫెడ్ సరికొత్త రికార్డు
- ●Grandparents' Day | తాతయ్యలు.. నానమ్మలతో చిన్నారుల సండే సందడి!
- ●Bigg Boss | బిగ్‌బాస్ షో లైవ్‌లో లవ్ ప్రపోజల్ - స్టేజ్‌మీద కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ తల్లిదండ్రులు
- ●TG Weather | బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..!
- ●Rahul Gandhi Ramlila Maidan Speech | జ్ఞానేశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయం.. తర్వాత మోదీ నీ వంతే!
- ●Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్

TG Oilfed | ఆయిల్‌పామ్‌లో టీజీ ఆయిల్‌ఫెడ్ సరికొత్త రికార్డు

Grandparents' Day | తాతయ్యలు.. నానమ్మలతో చిన్నారుల సండే సందడి!

Bigg Boss | బిగ్‌బాస్ షో లైవ్‌లో లవ్ ప్రపోజల్ - స్టేజ్‌మీద కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ తల్లిదండ్రులు

TG Weather | బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..!



