AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?
AePS | భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చెందిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి వ్యవస్థలతో పాటు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) కీలక పాత్ర పోషిస్తోంది.
AePS | భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చెందిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి వ్యవస్థలతో పాటు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ జాతీయ చెల్లింపుల సంస్థ (National Payments Corporation of India) అభివృద్ధి చేసిన ఈ సేవ మొదట ప్రభుత్వ ప్రత్యక్ష నగదు బదిలీల (DBT) కోసం ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను ప్రజల గడప దాకా తీసుకెళ్తోంది. AePS ద్వారా ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా కలిగిన వ్యక్తులు కేవలం తమ ఆధార్ నంబర్, బయోమెట్రిక్ ధ్రువీకరణ ఆధారంగా వివిధ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. నగదు ఉపసంహరణ, డిపాజిట్, ఖాతా నిల్వ (బ్యాలెన్స్) తెలుసుకోవడం, నిధుల బదిలీ, మినీ స్టేట్‌మెంట్ పొందడం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
ఆధార్ లింక్ ఖాతా ద్వారా సేవలు..
బ్యాంకులు నియమించే బిజినెస్ కరస్పాండెంట్లు (BCలు) మైక్రో ఏటీఎంలతో గ్రామాల్లోనే సేవలు అందిస్తున్నారు. దీంతో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతోంది. అంతేకాకుండా స్థానిక వ్యాపారులు BHIM Aadhaar Pay ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపులను స్వీకరించగలుగుతున్నారు. డెబిట్ కార్డు అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందడం, మైక్రో ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ, డిపాజిట్, ఖాతా నిల్వ, మినీ స్టేట్‌మెంట్ సౌకర్యం, ఒక ఆధార్-లింక్ ఖాతా నుంచి మరొక ఖాతాకు నగదు బదిలీ, గ్రామీణ ప్రాంతాల్లో బీమా ప్రీమియంల చెల్లింపులు సులభతరం, బయోమెట్రిక్ ధ్రువీకరణ కారణంగా మెరుగైన భద్రత వంటి సౌకర్యాలను ఈ విధానం అందిస్తోంది. AePS సేవలు పొందాలంటే ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా (AEBA) ఉండాలి. అలాగే ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ వివరాలు, బ్యాంకు పేరు, ఖాతా సమాచారం, వేలిముద్ర లేదా ఇతర బయోమెట్రిక్ ధ్రువీకరణ అవసరం అవుతాయి.
ఇలా పొందవచ్చు..
ఈ సేవల కోసం సమీపంలోని మైక్రో ఏటీఎం, కియోస్క్ లేదా AePS టచ్‌పాయింట్‌ను సందర్శించాలి. కావాల్సిన బ్యాంకింగ్ సేవను ఆపరేటర్‌కు తెలియజేయాలి. ఆధార్ నంబర్ ఇవ్వాలి. వేలిముద్ర ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయాలి. బ్యాంకు వివరాలను అందించాలి. ధ్రువీకరణ అనంతరం నగదు లేదా లావాదేవీ రశీదును అందజేస్తారు. AePS ద్వారా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలు సులభంగా బ్యాంకింగ్ సేవలు పొందగలుగుతున్నారు. స్థానిక రుణదాతలపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించడంతోపాటు, దేశంలో ఆర్థిక సమావేశం (Financial Inclusion) లక్ష్య సాధనకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- ●Indian Origin Pilot | హనీమూన్‌కు వెళ్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి వరుడు మృతి
- ●CBSE Tender Controversy | టెండర్ వివాదంపై CBSE మౌనం: తక్షణమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే
- ●SEBI | సెబీ గ్రీన్ సిగ్నల్.. మూడు ఐపీఓలకు దారి క్లియర్..
- ●Ponnam Prabhakar | పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే : మంత్రి పొన్నం
- ●Chamala Kirankumar Reddy | ప్రజల సొంతింట కల నెరవేరడం అత్యంత తృప్తినిస్తుంది: ఎంపీ చామల
- ●Shivani Nagaram | కోలీవుడ్‌లో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన అచ్చ తెలుగు బ్యూటీ

Indian Origin Pilot | హనీమూన్‌కు వెళ్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి వరుడు మృతి

CBSE Tender Controversy | టెండర్ వివాదంపై CBSE మౌనం: తక్షణమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే

SEBI | సెబీ గ్రీన్ సిగ్నల్.. మూడు ఐపీఓలకు దారి క్లియర్..

Ponnam Prabhakar | పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే : మంత్రి పొన్నం






