Mutual Funds | షేర్లు, మ్యూచువల్ ఫండ్లను అమ్మితే వచ్చే లాభంపై పన్ను చెల్లించాలా.. రూల్స్ ఎలా ఉన్నాయి..
Mutual Funds | ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడిదారుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ స్కీమ్‌లు స్టాక్ మార్కెట్‌లలో లిస్ట్ అయిన కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి. చాలా మంది నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతుంటారు. అందుకే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం మరింత సురక్షితమని భావిస్తారు.
Mutual Funds | ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడిదారుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ స్కీమ్‌లు స్టాక్ మార్కెట్‌లలో లిస్ట్ అయిన కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి. చాలా మంది నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతుంటారు. అందుకే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం మరింత సురక్షితమని భావిస్తారు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో లేదా నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టి లాభాలను బుక్ చేసుకోవాలనుకుంటే, ముందుగా ట్యాక్స్ నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ట్యాక్స్ కారణంగా ఏ ఆస్తిపైనైనా లభించే వాస్తవ రాబడి తగ్గుతుంది. ఇదే విషయం మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, షేర్లకు కూడా వర్తిస్తుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లేదా షేర్లను విక్రయించే ముందు లాభాలపై వర్తించే ట్యాక్స్ నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం.
రెండు రకాలుగా పన్ను..
చాలా మంది పెట్టుబడిదారులు ట్యాక్స్ రూల్స్ తెలియకుండానే షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయిస్తారు. దీంతో వారికి వచ్చే నిజమైన లాభం తగ్గిపోతుంది. షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టీసీజీ) ట్యాక్స్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) ట్యాక్స్ విధిస్తారు. ఈ ట్యాక్స్ పెట్టుబడిని ఎంతకాలం హోల్డ్ చేశారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఒక పెట్టుబడిదారు షేర్లను కొనుగోలు చేసిన 12 నెలల్లోపు విక్రయిస్తే, వచ్చిన లాభంపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. అదే 12 నెలల తర్వాత విక్రయిస్తే, ఆ లాభాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. ఇదే నిబంధన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు కూడా వర్తిస్తుంది.
20 శాతం లేదా 12.5 శాతం..
షేర్లను లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను 12 నెలల్లోపు విక్రయిస్తే, వచ్చిన లాభంపై 20 శాతం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఉదాహరణకు, ఒక కంపెనీ షేర్లను 12 నెలల్లోపు విక్రయించి రూ.1వేయి లాభం పొందితే, దానిపై 20 శాతం చొప్పున రూ.200 ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చేతికి మిగిలే నిజమైన లాభం రూ.800 మాత్రమే అవుతుంది. అదే షేర్లను కొనుగోలు చేసిన 12 నెలల తర్వాత విక్రయిస్తే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈ ట్యాక్స్ రేటు 12.5 శాతం. ఉదాహరణకు, ఒక కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత విక్రయించి రూ.1వేయి లాభం పొందితే, దానిపై 12.5 శాతం చొప్పున రూ.125 ట్యాక్స్ చెల్లించాలి. దీంతో మిగిలే నిజమైన లాభం రూ.875 అవుతుంది. ఇదే నిబంధన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల యూనిట్ల విక్రయానికి కూడా వర్తిస్తుంది.
ఈ పరిమితి వరకు మినహాయింపు..
అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ఒక ముఖ్యమైన పన్ను మినహాయింపు కూడా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విక్రయం ద్వారా పొందిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ.1.25 లక్షల వరకు ఉంటే, ఆ మొత్తంపై ఎలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో లాంగ్ టర్మ్ లాభం రూ.1.25 లక్షల వరకు ఉంటే, అది పూర్తిగా ట్యాక్స్ మినహాయింపు పరిధిలోకి వస్తుంది.
సంబంధిత వార్తలు

RBI | ఇక బ్యాంకులు బలవంతంగా ఆర్థిక ఉత్పత్తులను విక్రయించడం కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..
జులై 14, 2026

Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..
జులై 11, 2026

SIP | 2036 నాటికి రూ.1 కోటి లక్ష్యం.. నెలకు ఎంత SIP చేస్తే సాధ్యం?
జులై 11, 2026
తాజావార్తలు
- ●Alia Bhatt | కెరీర్లో ఫస్ట్ టైమ్ హారర్ మూవీలో అలియా భట్ - నిమిషానికి కోటి రెమ్యూనరేషన్?
- ●Srisailam Temple Matchbox Saree | శ్రీశైలం అమ్మవారికి సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక
- ●commercial shipping | వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపండి.. ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు
- ●Sea Planes | హుస్సేన్ సాగర్ టు ప్రకాశం బ్యారేజీ.. సీ ప్లేన్లు నడపాలన్న సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Hafiz Saeed | హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు

Alia Bhatt | కెరీర్లో ఫస్ట్ టైమ్ హారర్ మూవీలో అలియా భట్ - నిమిషానికి కోటి రెమ్యూనరేషన్?

Srisailam Temple Matchbox Saree | శ్రీశైలం అమ్మవారికి సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక

commercial shipping | వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపండి.. ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు

Sea Planes | హుస్సేన్ సాగర్ టు ప్రకాశం బ్యారేజీ.. సీ ప్లేన్లు నడపాలన్న సీఎం రేవంత్



