Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
Bhatti Vikramarka | రైతులు రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండొద్దని.. బ్యాంకులే రైతల వద్దకెళ్లి రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. రైతుల ఆదాయం పెరిగేలా రుణ విధానాలు ఉండాలని చెప్పారు.
- తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం
- అందుకు బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు కీలక భాగస్వాములుగా మారాలి
- రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్: రైతులు రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండొద్దని.. బ్యాంకులే రైతల వద్దకెళ్లి రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. రైతుల ఆదాయం పెరిగేలా రుణ విధానాలు ఉండాలని చెప్పారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అందుకు బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు కీలక భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. బుధవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందించడంతో పాటు రైతు ఆదాయం పెరిగేలా రుణ విధానాలు ఉండాలని సూచించారు. వ్యవసాయం, MSMEలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ పరిశ్రమలు, యువత ఉపాధి, గ్రీన్-క్లైమేట్ ఫైనాన్స్, డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వంటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ‘తెలంగాణ రైజింగ్ 2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్’ రూపొందించాలని చెప్పారు.
క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బ్యాంకింగ్ వ్యూహాలను రూపొందించి, తెలంగాణ అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం బలమైన భాగస్వామిగా నిలవాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.
సంబంధిత వార్తలు

Gade Innaiah gets bail | తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
ఆగస్టు 19, 2026

Harish Rao | తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A బాధితులు.. సమస్యలు విని బాధితులకు భరోసా ఇచ్చిన హరీశ్‌రావు
ఆగస్టు 19, 2026

MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | 2028లో తెలంగాణలో బీజేపీదే పవర్.. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇస్తాం
- ●Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్ వచ్చేనా?
- ●Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●Job Mela at Osmania University | ఓయూలో జాబ్ మేళా.. ఫార్మసీ, డిగ్రీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్, రూ.25 వేల జీతం
- ●Gade Innaiah gets bail | తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
- ●Sabitha Indra Reddy | 22A వెనుక ఆ 'మతలబు' ఏంటి? కమీషన్లు ఇస్తేనే క్లియరెన్సా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

Bandi Sanjay | 2028లో తెలంగాణలో బీజేపీదే పవర్.. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇస్తాం

Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్ వచ్చేనా?

Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..

Job Mela at Osmania University | ఓయూలో జాబ్ మేళా.. ఫార్మసీ, డిగ్రీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్, రూ.25 వేల జీతం





