Arbitrage Funds | ఆర్బిట్రాజ్ ఫండ్స్ అంటే ఏమిటి..? ఇలా ఎలా పనిచేస్తాయి..? ఎలా పెట్టుబడులు పెట్టాలి..?
Arbitrage Funds | దీర్ఘకాలంలో అధిక సంపదను సృష్టించుకునేందుకు మ్యుచువల్ ఫండ్స్ ఎంతో సహాయం చేస్తాయి. అందుకనే ప్రస్తుతం చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి సంప్రదాయ పొదుపు మార్గాలకు బదులుగా మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ ఫండ్స్‌లో అనేక రకాలు ఉంటాయి.
Arbitrage Funds | దీర్ఘకాలంలో అధిక సంపదను సృష్టించుకునేందుకు మ్యుచువల్ ఫండ్స్ ఎంతో సహాయం చేస్తాయి. అందుకనే ప్రస్తుతం చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి సంప్రదాయ పొదుపు మార్గాలకు బదులుగా మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ ఫండ్స్‌లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో భిన్న రకాల ఫండ్స్ భిన్నమైన లాభాలను అందిస్తాయి. ఇక ఆ ఫండ్స్ లో ఆర్బిట్రాజ్ ఫండ్స్ కూడా ఒకటి. ఆర్బిట్రాజ్ ఫండ్స్ తక్కువ రిస్క్ కలిగిన హైబ్రిడ్ మ్యుచువల్ ఫండ్లుగా చెలామణీలో ఉన్నాయి. ఇవి ఒకే ఆస్తి ధరలు వేర్వేరు మార్కెట్లలో ఉండే తేడాలను ఉపయోగించుకుని లాభాలు పొందుతాయి. ముఖ్యంగా క్యాష్ మార్కెట్, డెరివేటివ్స్ (Futures) మార్కెట్ మధ్య ధర వ్యత్యాసాలను ఉపయోగించుకోవడం వీటి ప్రధాన విధానం. సాధారణంగా ఈ ఫండ్లు క్యాష్ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేసి, అదే సమయంలో ఫ్యూచర్స్ మార్కెట్లో వాటిని అమ్మడం ద్వారా మార్కెట్ దిశతో సంబంధం లేకుండా లాభాన్ని లాక్ చేస్తాయి.
ఈక్విటీలతోపాటు డెట్, మనీ విభాగాల్లోనూ..
ఈ ఫండ్లను ఈక్విటీ-ఓరియెంటెడ్‌గా వర్గీకరిస్తారు. అంటే ఇవి ఈక్విటీల్లో ట్రేడ్ చేయడమే కాకుండా, డెట్, మనీ మార్కెట్ విభాగాల్లో కూడా పెట్టుబడులు పెడతాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మార్గదర్శకాల ప్రకారం ఆర్బిట్రాజ్ ఫండ్లు కనీసం 65 శాతం నిధులను ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాలి. క్యాష్ లేదా స్పాట్ మార్కెట్‌లో కొనుగోలుదారులు, విక్రేతలు ఒక ధరపై అంగీకరించి వెంటనే లావాదేవీ పూర్తి చేస్తారు. దీనికి విరుద్ధంగా ఫ్యూచర్స్ మార్కెట్‌లో భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీన జరిగే లావాదేవీకి ఇప్పుడే ధర నిర్ణయిస్తారు. పన్నుల పరంగా 12 నెలల లోపు విక్రయించిన యూనిట్లపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG)గా పరిగణించి 20 శాతం పన్ను విధిస్తారు. 12 నెలలకంటే ఎక్కువ కాలం ఉంచిన యూనిట్లపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG)గా పరిగణించి 12.5 శాతం పన్ను ఉంటుంది. ఈ పన్నులు ఆర్థిక సంవత్సరానికి రూ.1.25 లక్షలకుపైగా లాభాలపై వర్తిస్తాయి.
ధర పెరిగినా, తగ్గినా లాభమే..
ఆర్బిట్రాజ్ ఫండ్లు ఎలా పనిచేస్తాయంటే, ఉదాహరణకు ఒక కంపెనీ షేర్, క్యాష్ మార్కెట్లో రూ.500కు, ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.510కి ట్రేడ్ అవుతుందని అనుకుందాం. అప్పుడు ఫండ్ మేనేజర్ క్యాష్ మార్కెట్లో రూ.500కు షేర్ కొనుగోలు చేసి, ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.510కి కాంట్రాక్ట్ అమ్మేస్తాడు. దీంతో ఒక్కో షేర్‌పై రూ.10 లాభం లాక్ అవుతుంది (ట్రాన్సాక్షన్ ఖర్చులు తప్పించి). ఒకవేళ ఫ్యూచర్స్ గడువు ముగిసే సమయానికి షేర్ ధర రూ.550కి పెరిగితే, క్యాష్ మార్కెట్లో రూ.50 లాభం వస్తుంది కానీ ఫ్యూచర్స్‌లో రూ.40 నష్టం వస్తుంది. అయినప్పటికీ మొత్తం లాభం రూ.10గానే ఉంటుంది. అదే ధర రూ.400కి పడిపోయినా, క్యాష్ మార్కెట్లో రూ.100 నష్టం వచ్చినా, ఫ్యూచర్స్‌లో రూ.110 లాభం వస్తుంది. మొత్తంగా మళ్లీ రూ.10 లాభమే ఉంటుంది. ధరలు మారకపోయినా ఫ్యూచర్స్ ద్వారా రూ.10 లాభం వస్తుంది. ఈ విధంగా ధర తేడాలను ఉపయోగించి ఆర్బిట్రాజ్ ఫండ్లు లాభాలు పొందుతాయి.
స్వల్ప, మధ్య కాలిక లక్ష్యాలకు..
ఈ ఫండ్లలో ఈక్విటీ ఎక్స్‌పోజర్ ను పూర్తిగా హెడ్జ్ చేస్తారు. అంటే రిస్క్ తగ్గిస్తారు. అందువల్ల ధర తగ్గడం ప్రమాదం దాదాపు ఉండదు. పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన విషయాల్లో ముఖ్యంగా డెట్ భాగంలో క్రెడిట్ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బేరిష్ మార్కెట్లలో ఫ్యూచర్స్ ధరలు క్యాష్ ధరల కంటే తక్కువగా ఉండడం వల్ల ఈ ఫండ్ల పనితీరు ప్రభావితమవుతుంది. ఆర్బిట్రాజ్ ఫండ్లు స్వల్ప కాలం నుండి మధ్యకాల పెట్టుబడి లక్ష్యాలకు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా 3 నుండి 6 నెలల పెట్టుబడి గడువుతో ఉన్న వారికి ఇవి సరిపోతాయి. ఈ ఫండ్లలో సిప్ కంటే లంప్‌సమ్ పెట్టుబడి చేయడం మంచిదిగా భావిస్తారు. పెట్టుబడి చేసే ముందు స్కీమ్ ఆఫర్ డాక్యుమెంట్‌ను జాగ్రత్తగా చదవాలి. ఇందులో పెట్టుబడి లక్ష్యాలు, వ్యూహం, ప్రమాదాలు, ఆస్తి కేటాయింపు, ఫీజులు వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఈ ఫండ్లు ఈక్విటీ, డెట్ మిశ్రమంలో పెట్టుబడి చేస్తాయి కాబట్టి, ఆస్తి కేటాయింపులను అర్థం చేసుకుని పెట్టుబడి లక్ష్యాలకు సరిపోతుందో లేదో పరిశీలించాలి. ఇతర మ్యూచువల్ ఫండ్ల మాదిరిగానే, ఆర్బిట్రాజ్ ఫండ్లు కూడా మేనేజ్‌మెంట్ ఫీజును వసూలు చేస్తాయి. ఈ ఫీజు ఫండ్ ఆస్తులపై శాతం రూపంలో ఉంటుంది. ఫండ్ రాబడుల నుంచి ఫీజును మినహాయించుకుంటారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



