త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICICI | ఐసీఐసీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. బ‌యోమెట్రిక్ ద్వారా పేమెంట్స్ చేయ‌వ‌చ్చు..

ICICI | ప్రముఖ డిజిటల్ వాలెట్ ఫోన్‌పే ఈ ఏడాది ప్రారంభంలో యూపీఐ చెల్లింపుల కోసం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఐసీఐసీఐ బ్యాంక్ తన ఐ-మొబైల్ యాప్‌లో కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఫీచర్ తాజా యాప్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.

S

Technology | Published On May 3, 2026, 3.20 pm IST

ICICI | ఐసీఐసీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. బ‌యోమెట్రిక్ ద్వారా పేమెంట్స్ చేయ‌వ‌చ్చు..
Advertisement

ICICI | ప్రముఖ డిజిటల్ వాలెట్ ఫోన్‌పే ఈ ఏడాది ప్రారంభంలో యూపీఐ చెల్లింపుల కోసం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఐసీఐసీఐ బ్యాంక్ తన ఐ-మొబైల్ యాప్‌లో కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఫీచర్ తాజా యాప్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఐ-మొబైల్ వి30.0 ద్వారా ఫింగర్‌ప్రింట్‌తో ట్రాన్సాక్షన్లను ఆథరైజ్ చేయగలుగుతారు. ఐఓఎస్ వినియోగదారులు ఐ-మొబైల్ వి28.2 ద్వారా ఫేస్ రికగ్నిషన్ ఉపయోగించి చెల్లింపులను ధ్రువీకరించవచ్చు.

ఫింగ‌ర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీతో..

ఈ కొత్త సదుపాయంతో వినియోగదారులు పీర్-టు-పీర్ మనీ ట్రాన్స్‌ఫర్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి షాపుల్లో చెల్లింపులు చేయడం, లేదా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను తమ ఫోన్‌లో ఉన్న ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేదా ఫేస్‌ఐడీ ద్వారా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అయితే రూ.5వేల‌కు మించిన ట్రాన్సాక్షన్ల కోసం వినియోగదారులు తప్పనిసరిగా తమ యూపీఐ పిన్‌ను ఉపయోగించి చెల్లింపును ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ఫీచ‌ర్‌ను ఆన్ చేయాలంటే అందుకు ప‌లు స్టెప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.

ఇలా యాక్టివేట్ చేయండి..

మొదటగా యాప్‌లో లాగిన్ అవ్వాలి. తర్వాత యూపీఐ పేమెంట్స్ విభాగానికి వెళ్లి యూపీఐ సెట్టింగ్స్ ఎంపిక చేయాలి. ఆపై సంబంధిత అకౌంట్ నంబర్‌ను ఎంచుకుని యూజ్ బయోమెట్రిక్ ఫర్ పేమెంట్స్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. చివరగా యూపీఐ పిన్ నమోదు చేస్తే బయోమెట్రిక్ వెరిఫికేషన్ యాక్టివేట్ అవుతుంది. ఇటీవలే పేటీఎం కూడా యూపీఐ చెల్లింపుల కోసం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఐ-మొబైల్ యాప్ మాదిరిగానే పేటీఎం యూజర్లు కూడా రూ.5వేల వరకు ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్‌ఐడీ ద్వారా ట్రాన్సాక్షన్లు చేయ‌వ‌చ్చు.

పేటీఎంలోనూ..

అలాగే పేటీఎం యాప్ వినియోగదారులకు కార్డు అవసరం లేకుండా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ చేసే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. యూపీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక్క ట్రాన్సాక్షన్‌కు రూ.10వేల వరకు డబ్బు విత్ డ్రా చేయ‌వచ్చు. అయితే రోజువారీ పరిమితి ఆయా బ్యాంకులు నిర్ణయించిన విధంగా ఉంటుంది. ఈ సేవలను వినియోగించేందుకు పేటీఎం యాప్ తప్పనిసరిగా వినియోగదారులు త‌మ‌ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement