Road Accident | మేడ్చల్‌లో కారు.. లింగాలఘనపూర్‌లో మినీ ట్రక్కు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం
Road Accident | వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఏడుగురు దుర్మరణం చెందారు. మేడ్చల్‌లో లారీ, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. జనగామ జిల్లా లింగాలఘనపూర్‌లో మినీ ట్రక్కును లారీ గుద్దడంతో మరో ముగ్గురు చనిపోయారు.
Road Accident | త్రినేత్ర.న్యూస్: వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఏడుగురు దుర్మరణం చెందారు. మేడ్చల్‌లో లారీ, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. జనగామ జిల్లా లింగాలఘనపూర్‌లో మినీ ట్రక్కును లారీ గుద్దడంతో మరో ముగ్గురు చనిపోయారు.
గురువారం ఉదయం మేడ్చల్ పరిధిలోని తుర్కపల్లి-మురహరిపల్లి మధ్య.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగకుండా డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న లారీని బలంగా గుద్దుకున్నది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మృతులను గోదావరిఖనికి చెందిన దంపతులు చంద్రశేఖర్, రేఖగా గుర్తించారు. రేఖ చెల్లెలు కుమారుడు నిహాల్ మృతి, చంద్రశేఖర్ కుమారుడు గాయపడ్డారు.

టైరు మారుస్తుండగా..
దేవరుప్పుల మండలంలో కిరాణా దుకాణం నిర్వహించే జాట్ రోహిత్, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లికి చెందిన మధు.. టాటా ఏస్ మినీ ట్రక్కులో హైదరాబాద్ నుంచి కిరాణా సామాను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల సమీపంలో ట్రక్కు టైరు పంక్చర్ అయింది. దీంతో అదే దారిలో వెళ్తున్న లారీని ఆపి జాకీ తీసుకున్నారు. లారీ క్లీనర్ రాజేందర్, ట్రక్కు డ్రైవర్ మధు, కిరాణా దుకాణ యజమాని రోహిత్.. పంక్చర్ అయిన టైరును మారుస్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు జనగామ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు.

బైకును ఢీకొట్టిన టిప్పర్
వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్టితో వెళ్తున్న టిప్పర్ లారీ బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో టిప్పర్ కిందపడి యువకుడి తల భాగం నుజ్జునుజ్జైంది. మృతుడు జావీద్‌పాషా(30) మోమిన్‌కలాన్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Road Accident | లారీని ఢీకొట్టిన మినీ బస్సు.. డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం
ఆగస్టు 31, 2026

Kishan Reddy | వికారాబాద్ రైల్వే స్టేషన్లో రూ.27 కోట్లతో అభివృద్ది పనులు.. ఏడాది చివరికి మెరుగైన సౌకర్యాలు: కిషన్‌రెడ్డి
ఆగస్టు 30, 2026

Bus Accident | ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!
- ●Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష - పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్
- ●Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి
- ●Chanchalguda to Santoshnagar Flyover | పాతబస్తీ ట్రాఫిక్ కష్టాలకు చెక్: చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్
- ●BJP Malka Komaraiah | ఫీజులు అడిగితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు

Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్

Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష - పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్

Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి



