Airtel | ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ 5జి సేవలపై ట్రాయ్ పరిశీలన.. నిబంధనలను ఉల్లంఘిస్తుందా..?
Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ ఇటీవలే తన పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ సేవను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పందించింది. ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ ఇటీవలే తన పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ సేవను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పందించింది. ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ సేవను ఈ వారం భారత్‌లో ప్రారంభించిన ఎయిర్‌టెల్, అధిక ట్రాఫిక్ పరిస్థితుల్లో కూడా వేగవంతమైన కనెక్టివిటీ అందించేందుకు 5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ దేశంలోని నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు అనుగుణంగా ఉందా అనే అంశంపై ఇప్పుడు అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. రిపోర్టుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్ అధికారులు ఎయిర్‌టెల్ సేవ ఎలా పనిచేస్తుందనే విషయంపై మరిన్ని సాంకేతిక వివరాలు కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సేవ నెట్ న్యూట్రాలిటీ సూత్రాలను ఉల్లంఘించే అవకాశం ఉందా అనే కోణంలో పరిశీలన సాగుతోంది.
నెట్ న్యూట్రాలిటీకి విరుద్ధమా..
నెట్ న్యూట్రాలిటీ అనేది ఇంటర్నెట్ సేవా సంస్థలు మొత్తం ఆన్‌లైన్ డేటాను సమానంగా నిర్వహించాలనే ప్రాథమిక సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఏ వెబ్‌సైట్ లేదా యాప్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలాగే ఏ కంటెంట్‌నైనా ఒకే రకమైన వేగంతో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. కాగా కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా ఇప్పటికే ఈ సేవపై అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. పోస్టుపెయిడ్ వినియోగదారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రీపెయిడ్ వినియోగదారుల సేవా నాణ్యతపై ప్రతికూల ప్రభావం ఉంటుందా అనే అంశాన్ని కూడా ట్రాయ్ పరిశీలిస్తోంది. ఈ సేవలో కీలకంగా మారిన అంశం 5జీ స్టాండలోన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేసే నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ. అధికారులు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను ఎలా విభజించి నిర్వహిస్తున్నారో వివరించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్ అమల్లో పోస్టుపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా నెట్‌వర్క్‌లో కొంత భాగాన్ని కేటాయించినట్లు సమాచారం.
అనేక దేశాల్లో ఇప్పటికే అమలు..
అయితే టెలికాం రంగ నిపుణులు, నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ కంపెనీలు, ఇంటర్నెట్ హక్కుల కార్యకర్తలలో చాలా మంది ఈ సేవను నెట్ న్యూట్రాలిటీకి నేరుగా విరుద్ధంగా చూడటం లేదని రిపోర్ట్ పేర్కొంది. యూకే, అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే ఇలాంటి సేవలు అమల్లో ఉన్నాయని చెబుతున్నారు. ఎయిర్‌టెల్ తెలిపిన ప్రకారం 5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ ద్వారా ప్రత్యేక నెట్‌వర్క్ వనరులు కేటాయించడం వల్ల పోస్టుపెయిడ్ వినియోగదారులకు మరింత స్థిరమైన, విశ్వసనీయమైన నెట్‌వర్క్ అనుభవం లభిస్తుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ సేవ ఎయిర్‌టెల్ పోస్టుపెయిడ్ కస్టమర్లకే అందుబాటులో ఉంది. దేశంలో ఎయిర్‌టెల్‌కు ఉన్న 373 మిలియన్ మొబైల్ సబ్‌స్క్రైబర్లలో సుమారు 7.75 శాతం మంది పోస్టుపెయిడ్ యూజర్లు ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.
సంబంధిత వార్తలు

Spam Calls | స్పామ్ కాల్స్‌కు చెక్.. ఇలా చేస్తే వేధింపులకు బ్రేక్..
జూన్ 5, 2026

Airtel | ఎయిర్‌టెల్ నుంచి ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్.. ఆ యూజర్లకే మొదటి ప్రాధాన్యత..
మే 19, 2026

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026
తాజావార్తలు
- ●Sukhoi Su-57 jet | సుఖోయ్ ఎస్‌యూ-57 తయారుచేద్దాం.. భారత్‌కు పుతిన్ కీలక ప్రతిపాదన
- ●Sama Rammohan Reddy | బీఆర్ఎస్ మాట్లాడడం ప్రాజెక్టును బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది: సామ రామ్మోహన్ రెడ్డి
- ●Peddi Day 1 Collection | రామ్‌చరణ్ పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్ - దేవర , పుష్ప 2 కంటే తక్కువే
- ●Induction Stove | ఇండక్షన్ స్టవ్ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి
- ●Copilot Plus PC | కోపైలట్ ప్లస్ పీసీ అంటే ఏమిటి.. సాధారణ పీసీలకు, వీటికి తేడా ఏంటి..?
- ●Naga Chaitanya | నాగచైతన్య తెలుగు హారర్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ వస్తోంది - సైలెంట్‌గా దూత 2 లాంఛ్

Sukhoi Su-57 jet | సుఖోయ్ ఎస్‌యూ-57 తయారుచేద్దాం.. భారత్‌కు పుతిన్ కీలక ప్రతిపాదన

Sama Rammohan Reddy | బీఆర్ఎస్ మాట్లాడడం ప్రాజెక్టును బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది: సామ రామ్మోహన్ రెడ్డి

Peddi Day 1 Collection | రామ్‌చరణ్ పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్ - దేవర , పుష్ప 2 కంటే తక్కువే

Induction Stove | ఇండక్షన్ స్టవ్ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి



