Spam Calls | స్పామ్ కాల్స్‌కు చెక్.. ఇలా చేస్తే వేధింపులకు బ్రేక్..
Spam Calls | భారత్‌లో స్పామ్ కాల్స్ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక స్పామ్ కాల్స్ వస్తున్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉందని ట్రూకాలర్ వెల్లడించింది. ఇండోనేషియా, చిలీ, వియత్నాం, బ్రెజిల్ తర్వాత భారత్ నిలవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయితే కొన్ని సులభమైన చర్యలతో స్పామ్ కాల్స్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
Technology | Published On Jun 5, 2026, 11.06 am IST
Spam Calls | భారత్‌లో స్పామ్ కాల్స్ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక స్పామ్ కాల్స్ వస్తున్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉందని ట్రూకాలర్ వెల్లడించింది. ఇండోనేషియా, చిలీ, వియత్నాం, బ్రెజిల్ తర్వాత భారత్ నిలవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయితే కొన్ని సులభమైన చర్యలతో స్పామ్ కాల్స్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. మొదట డు నాట్ డిస్టర్బ్ (DND) సేవను యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకోసం START 0 అని టైప్ చేసి 1909కు SMS పంపవచ్చు లేదా 1909కు కాల్ చేసి IVRS సూచనల ప్రకారం DND ఎంపిక చేసుకోవచ్చు. దీంతో ప్రమోషనల్ కాల్స్, మార్కెటింగ్ సందేశాలు నిలిచిపోతాయి. స్పామ్ కాల్స్‌పై ఫిర్యాదు చేయడానికి ట్రాయ్ అందిస్తున్న TRAI DND యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా DND యాక్టివేషన్‌తోపాటు నిబంధనలు ఉల్లంఘించే నంబర్లపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
టెలికాం యాప్‌లలోనూ..
జియో, ఎయిర్‌టెల్, వీఐ వినియోగదారులు తమ టెలికాం యాప్‌లలోని సెట్టింగ్స్ ద్వారా కూడా DND సేవను ప్రారంభించవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్, ఐఫోన్లలో సైలెన్స్ అన్‌నౌన్స్ కాలర్స్ ఫీచర్లను ఆన్ చేస్తే అనుమానాస్పద కాల్స్ ఆటోమేటిక్‌గా ఫిల్టర్ అవుతాయి.
ట్రూ కాలర్ ద్వారా..
ట్రూకాలర్ వినియోగదారులు బ్లాక్ టాప్ స్పామర్స్ ఫీచర్‌ను ఉపయోగించి స్పామ్ కాల్స్‌ను అడ్డుకోవచ్చు. మరోవైపు ట్రాయ్ 140, 1600 సిరీస్ నంబర్లను ప్రత్యేకంగా కేటాయించడం, సాధారణ మొబైల్ నంబర్ల ద్వారా మార్కెటింగ్ కాల్స్‌ను నిషేధించడం వంటి చర్యలు చేపట్టింది. అలాగే ప్రభుత్వం సంచార్ సాథీ పోర్టల్ ద్వారా స్పామ్, మోసపూరిత కాల్స్‌పై ఫిర్యాదుల స్వీకరణకు అవకాశం కల్పిస్తోంది. దీంతో వినియోగదారులకు మరింత రక్షణ లభిస్తోంది. అందువల్ల ఈ చర్యలను పాటిస్తే స్పామ్ కాల్స్ రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
తాజావార్తలు
- ●Harish Rao | సీఎం రేవంత్ మౌనమే.. చంద్రబాబుకు ధైర్యమా..?
- ●HYDRAA | హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన 8 కాలేజీలు
- ●Dubai | 20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. దద్దరిల్లిన దుబాయ్ నగరం
- ●POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
- ●PM Modi | క్షమాపణలు చెప్తారా..? చర్యలు ఎదుర్కొంటారా..? మెటాకు కేంద్రం అల్టిమేటం
- ●Addanki Dayakar | హరీశ్ రావుపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..: అద్దంకి దయాకర్

Harish Rao | సీఎం రేవంత్ మౌనమే.. చంద్రబాబుకు ధైర్యమా..?

HYDRAA | హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన 8 కాలేజీలు

Dubai | 20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. దద్దరిల్లిన దుబాయ్ నగరం

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..






