త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LG 2026 TV | స‌ర్‌ప్రైజ్ చేసిన ఎల్‌జీ ఎల‌క్ట్రానిక్స్‌.. సోనీకి పోటీగా 115 ఇంచుల భారీ ఎల్ఈడీ టీవీ లాంచ్‌..

LG 2026 TV | ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్‌లో తన 2026 ఏఐ టీవీ శ్రేణిని అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త లైనప్‌లో మొత్తం 25 అల్ట్రా లార్జ్ స్క్రీన్ మోడళ్లు ఉన్నాయి. క్యూఎన్‌ఈడీ ఈవో మినీ ఎల్ఈడీ, ఓఎల్ఈడీ ఈవో, మైక్రో ఆర్‌జీబీ ఈవో, మినీ ఆర్‌జీబీ ఈవో, నానో 4కె యూహెచ్‌డీ డిస్‌ప్లే టెక్నాలజీలతో ఈ టీవీలు అందుబాటులోకి వచ్చాయి.

S

Technology | Published On Aug 5, 2026, 4.55 pm IST

LG 2026 TV | స‌ర్‌ప్రైజ్ చేసిన ఎల్‌జీ ఎల‌క్ట్రానిక్స్‌.. సోనీకి పోటీగా 115 ఇంచుల భారీ ఎల్ఈడీ టీవీ లాంచ్‌..
Advertisement

LG 2026 TV | ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్‌లో తన 2026 ఏఐ టీవీ శ్రేణిని అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త లైనప్‌లో మొత్తం 25 అల్ట్రా లార్జ్ స్క్రీన్ మోడళ్లు ఉన్నాయి. క్యూఎన్‌ఈడీ ఈవో మినీ ఎల్ఈడీ, ఓఎల్ఈడీ ఈవో, మైక్రో ఆర్‌జీబీ ఈవో, మినీ ఆర్‌జీబీ ఈవో, నానో 4కె యూహెచ్‌డీ డిస్‌ప్లే టెక్నాలజీలతో ఈ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. 75 ఇంచుల సైజు నుంచి ప్రారంభమయ్యే ఈ టీవీ సిరీస్‌లో భారత్‌లో తొలిసారిగా 115 ఇంచుల క్యూఎన్‌ఈడీ ఈవో మినీ ఎల్ఈడీ టీవీని కూడా ఎల్జీ లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతం కంపెనీ భారత మార్కెట్‌లో విడుదల చేసిన అతిపెద్ద మినీ ఎల్ఈడీ టీవీగా నిలిచింది. క్యూఎన్‌ఈడీ ఈవో మినీ ఎల్ఈడీ సిరీస్‌లో క్యూఎన్‌ఈడీ90, క్యూఎన్‌ఈడీ86, క్యూఎన్‌ఈడీ85, క్యూఎన్‌ఈడీ82, క్యూఎన్‌ఈడీ70 మోడళ్లు ఉన్నాయి. ఎంపిక చేసిన మోడళ్లలో ఆల్ఫా 8 ఏఐ ప్రాసెసర్ జెన్ 3, డైనమిక్ క్యూఎన్‌ఈడీ కలర్ ప్రొ, ఇంటర్‌టెక్ ధ్రువీకరించిన 100 శాతం కలర్ వాల్యూం వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రెసిషన్ డిమ్మింగ్ అల్ట్రా టెక్నాలజీ, వేల సంఖ్యలో డిమ్మింగ్ జోన్లు, 330 హెడ్జ్ వరకు మోషన్ బూస్టర్, 165 హెడ్జ్ వరకు వీఆర్‌ఆర్, ఆటో లో లేటెన్సీ మోడ్ వంటి గేమింగ్ ఫీచర్లను కూడా అందించారు.

అద్భుత‌మైన డిస్‌ప్లే ఫీచ‌ర్లు..

ఓఎల్ఈడీ ఈవో జీ6, ఓఎల్ఈడీ ఈవో సీ6 టీవీల్లో ఆల్ఫా 11 డ్యుయల్ ఏఐ ఇంజిన్ ప్రాసెసర్ జెన్ 3 ఉంది. హైపర్ రేడియంట్ కలర్ టెక్నాలజీ, బ్రైట్‌నెస్ బూస్టర్ అల్ట్రా, రిఫ్లెక్షన్ ఫ్రీ ప్రీమియం, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ఏఐ సౌండ్ ప్రొ, ఎన్విడియా జి-సింక్, ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఓఎల్ఈడీ ఈవో జీ6 సాధారణ ఓఎల్ఈడీ టీవీలతో పోలిస్తే 3.9 రెట్లు ఎక్కువ బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని ఎల్జీ తెలిపింది. అలాగే 4కె 165 హెడ్జ్ వీఆర్‌ఆర్ గేమింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. జీ6, సీ6 మోడళ్లకు పర్‌ఫెక్ట్ బ్లాక్, పర్‌ఫెక్ట్ కలర్ వెరిఫికేషన్‌తో పాటు 3 సంవత్సరాల ప్యానెల్ వారంటీ ఇస్తున్నారు. సీ6లో వర్చువల్ 11.1.2 ఛానల్ ఏఐ సౌండ్ ప్రొ కూడా అందుబాటులో ఉంది. ఓఎల్ఈడీ బీ6 మోడల్‌లో ఆల్ఫా 8 ఏఐ ప్రాసెసర్ జెన్ 3, బ్రైట్ రూమ్ రెడీ పనితీరు, పర్‌ఫెక్ట్ బ్లాక్, పర్‌ఫెక్ట్ కలర్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, వర్చువల్ 11.1.2 ఛానల్ ఏఐ సౌండ్ ప్రొ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీయూవీ రైన్‌ల్యాండ్ స‌ర్టిఫికేష‌న్‌..

మైక్రో ఆర్‌జీబీ ఈవో ఎంఆర్‌జీబీ96 టీవీలో ఎల్జీ మైక్రో ఆర్‌జీబీ టెక్నాలజీతోపాటు ఆల్ఫా 11 ఏఐ ప్రాసెసర్ జెన్ 3ని ఉపయోగించారు. బీటీ.2020, డీసీఐ-పీ3, అడోబ్ ఆర్‌జీబీ కలర్ స్పేస్‌లలో ట్రిపుల్ 100 శాతం కలర్ కవరేజ్‌ను అందిస్తుంది. టీయూవీ రైన్‌ల్యాండ్ నుంచి హై ప్యూరిటీ ఆర్‌జీబీ స్పెక్ట్రమ్ డిస్‌ప్లే సర్టిఫికేషన్ పొందింది. 100 ఇంచుల ఎంఆర్‌జీబీ96బీఎల్ మోడల్ భారత్‌లో విక్రయానికి అందుబాటులోకి రానుంది. మినీ ఆర్‌జీబీ ఈవో ఎంఆర్‌జీబీ85 సిరీస్‌లో టాండమ్ ఎల్ఈడీ టెక్నాలజీ, ఆల్ఫా 8 ఏఐ ప్రాసెసర్ జెన్ 3, ప్రెసిషన్ డిమ్మింగ్, డబుల్ 100 శాతం కలర్ కవరేజ్, టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఫీచర్లు ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

ఈ కొత్త టీవీలు ఎల్జీ అధీకృత రిటైల్ స్టోర్లతోపాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. క్యూఎన్‌ఈడీ ఈవో మినీ ఎల్ఈడీ సిరీస్ ప్రారంభ ధర రూ.52,990గా ఉంది. ఓఎల్ఈడీ ఈవో జీ6 ధర రూ.2,14,990 నుంచి, ఓఎల్ఈడీ ఈవో సీ6 రూ.1,19,990 నుంచి ప్రారంభమవుతుంది. ఓఎల్ఈడీ బీ6 ధర రూ.1,47,490గా ఉంది. మైక్రో ఆర్‌జీబీ ఈవో 100 ఇంచుల మోడల్ ధరను రూ.12,99,990గా నిర్ణయించారు. మినీ ఆర్‌జీబీ ఈవో సిరీస్ ధర రూ.1,28,990 నుంచి ప్రారంభమవుతుంది. నానో 4కె యూహెచ్‌డీ టీవీల ప్రారంభ ధర రూ.38,990 కాగా, స్మార్ట్ ఏఐ టీవీ ఎల్బీ65 సిరీస్ రూ.19,990 నుంచి అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement