BEL | బీఈఎల్‌లో 350 ప్రొబేషనరీ ఇంజినీర్లు.. నేటి నుంచి దరఖాస్తులు షురూ..
BEL | ఇంజినీరింగ్ పాసయ్యారా? ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీలాంటి వారికోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) మంచి అవకాశం కల్పిస్తున్నది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BEL | త్రినేత్ర న్యూస్: ఇంజినీరింగ్ పాసయ్యారా? ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీలాంటి వారికోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) మంచి అవకాశం కల్పిస్తున్నది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 350 ప్రొబేషనరీ ఇంజినీర్ (Probationary Engineer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, నాలుగేండ్ల బీఎస్సీ పూర్తిచేసిన వారు అదధికారిక వెబ్‌సైట్ www.bel-india.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 28న ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. నవంబర్ 18 వరకు అవకాశం ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ప్రతి నెల రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్రలలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
మొత్తం పోస్టులు: 350
ప్రొబేషనరీ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్- 200 (జనరల్ 81, ఈడబ్ల్యూఎస్‌కు 20, ఓబీసీ-ఎన్‌సీఎల్ 54, ఎస్సీ 30, ఎస్టీ 15)
మెకానికల్- 150 (జనరల్ 62, ఈడబ్ల్యూఎస్‌కు 15, ఓబీసీ-ఎన్‌సీఎల్ 40, ఎస్సీ 22, ఎస్టీ 11)
అదనంగా దివ్యాంగులకు (బ్యాక్‌లాగ్) 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్‌లో బీఈ లేదా బీటెక్ లేదా నాలుగేండ్ల బీఎస్సీ పూర్తి చేయాలి. అభ్యర్థులు 2026 అక్టోబర్ 1 నాటికి 25 ఏండ్ల లోపువారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏండ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాతపరీక్షలో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. టెక్నికల్ ప్రశ్నలు 100, రీజనింగ్, జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు 25 వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. ఈ ఎగ్జామ్‌లో జనరల్ వర్గాలవారు 35 శాతం, ప్రత్యేక వర్గాలకు చెందినవారు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. వీరిని 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాతపరీక్షకు 85 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకి 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.1180, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తులకు చివరి తేదీ: నంబర్ 18
వెబ్‌సైట్: www.bel-india.in
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cyclone Arnab | తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాను.. పలు విమానాలు, రైళ్లు రద్దు
- ●Kolkata | బాలికకు ముద్దు పెట్టాడని తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించారు.. నిందితులను కూడా..
- ●Rishabh Singh Sambyal | ఆర్మీని వీడి.. ఫ్యాషన్ రంగంలోకి.. మోడల్‌గా మారిన రాష్ట్రపతి మాజీ ఏడీసీ
- ●Holiday | అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. నేడు భద్రాద్రి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
- ●ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్
- ●Horoscope | అక్టోబర్ 28 రాశిఫలాలు.. తెలివితేటలతో కోరికలు నెరవేర్చుకుంటారు!

Cyclone Arnab | తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాను.. పలు విమానాలు, రైళ్లు రద్దు

Kolkata | బాలికకు ముద్దు పెట్టాడని తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించారు.. నిందితులను కూడా..

Rishabh Singh Sambyal | ఆర్మీని వీడి.. ఫ్యాషన్ రంగంలోకి.. మోడల్‌గా మారిన రాష్ట్రపతి మాజీ ఏడీసీ

Holiday | అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. నేడు భద్రాద్రి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు






