IPO | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఈ వారంలో మూడు ఐపీవోలు..
IPO | ఈ వారం ట్రేడింగ్ సెషన్లలో మూడు కొత్త ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPO) మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు కాగా ఒకటి ఎస్ఎంఈ సెగ్మెంట్‌కు చెందినది. ఈ ఐపీఓలకు బిడ్డింగ్ తేదీలు, ప్రైస్ బ్యాండ్లు ఖరారవ్వగా, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) మాత్రం పెద్దగా ఉత్సాహం చూపడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
IPO | ఈ వారం ట్రేడింగ్ సెషన్లలో మూడు కొత్త ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPO) మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు కాగా ఒకటి ఎస్ఎంఈ సెగ్మెంట్‌కు చెందినది. ఈ ఐపీఓలకు బిడ్డింగ్ తేదీలు, ప్రైస్ బ్యాండ్లు ఖరారవ్వగా, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) మాత్రం పెద్దగా ఉత్సాహం చూపడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో ఏయ్ (Aye) ఫైనాన్స్, ఫ్రాక్టల్ అనలిటిక్స్, మరుషికా టెక్నాలజీ కంపెనీలు ఐపీవోలకు రానున్నాయి.
ఏయ్ ఫైనాన్స్ ఐపీఓ..
ఏయ్ ఫైనాన్స్ ఐపీఓ సోమవారం, ఫిబ్రవరి 9న ప్రారంభమై బుధవారం, ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓకు కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.122-129గా నిర్ణయించింది. లాట్ సైజ్ 116 షేర్లు కాగా, పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ కొనుగోలు చేయాలి. ఒక ఇన్వెస్టర్ మల్టిపుల్ లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ షేర్ సేల్ ద్వారా కంపెనీ మొత్తం రూ.1,010 కోట్లను సమీకరించాలనుకుంటోంది.
గ్రే మార్కెట్ విషయానికి వస్తే, ఇన్వెస్టర్‌గెయిన్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ఐపీఓకి జీఎంపీ సున్నాగా ఉంది. అయితే లిస్టింగ్ వరకు ఇది మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఐపీఓ..
మెయిన్‌బోర్డ్ విభాగానికి చెందిన ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఐపీఓ కూడా ఫిబ్రవరి 9న ప్రారంభమై ఫిబ్రవరి 11న ముగుస్తుంది. షేర్ ప్రైస్ బ్యాండ్‌ను రూ.857-900గా నిర్ణయించారు. లాట్ సైజ్ 16 షేర్లు. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.2,833.90 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రే మార్కెట్ ప్రీమియం ప్రస్తుతం రూ.29గా ఉందని ఇన్వెస్టర్‌గెయిన్ తెలిపింది. ఇది గతంలో నమోదైన రూ.180తో పోలిస్తే గణనీయంగా తగ్గడం గమనార్హం.
మరుషికా టెక్నాలజీ ఐపీఓ (ఎస్ఎంఈ)..
మరుషికా టెక్నాలజీ ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఐపీఓకు వస్తోంది. ఇది గురువారం, ఫిబ్రవరి 12న ప్రారంభమై సోమవారం, ఫిబ్రవరి 16 వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓకు ప్రైస్ బ్యాండ్ ను రూ.111-117గా నిర్ణయించగా, లాట్ సైజ్ 1,200 షేర్లు. ఈ షేర్ సేల్ ద్వారా కంపెనీ రూ.26.97 కోట్లను సమీకరించనుంది. గ్రే మార్కెట్లో ప్రస్తుతం ఈ ఐపీఓ జీఎంపీ కూడా సున్నాగా ఉందని ట్రాకర్లు పేర్కొంటున్నారు.
అయితే ఈ వారం మూడు ఐపీఓలు మార్కెట్లోకి రానున్నప్పటికీ, గ్రే మార్కెట్ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు బిడ్డింగ్‌కు ముందు కంపెనీల ఆర్థిక స్థితి, వ్యాపార నమూనా, రిస్క్ అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

NSE | చరిత్ర సృష్టించిన ఎన్ఎస్ఈ.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎక్స్ఛేంజ్గా రికార్డు..
నవంబర్ 26, 2026

SEBI | ఐపీఓ జీఎంపీ ప్రచారానికి సెబీ బ్రేకులు.. మధ్యవర్తులకు కీలక ఆదేశాలు..
నవంబర్ 24, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు ఇదే అనుకూల సమయమా..?
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



