Bank Holidays | ఉగాది, శ్రీరామ నవిమి పండుగలు..! మార్చిలో బ్యాంకులు 18 రోజులు బంద్..!
Bank Holidays | ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నది. మార్చిలో దాదాపు 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం విధితమే. తాజాగా బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది.
Bank Holidays | ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నది. మార్చిలో దాదాపు 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం విధితమే. తాజాగా బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకొని వెళ్తే ఇబ్బందులు ఉండవు. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 18 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్బ్యాంకు, యూపీఐ సర్వీసులు 24/7 కొనసాగనున్నాయి. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు, డిపాజిట్ కోసం మెషిన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే, పలు సేవల కోసం తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే, కొన్ని అవసరాల కోసం మాత్రమే బ్యాంకులకు వెళ్లక తప్పదు. సెలువుల సమాచారం ఉంటే ముందస్తుగానే పూర్తి చేసుకునేందుకు వీలుంటుంది. మార్చిలో హోలీ, ఉగాది, శ్రీరామనవమి తదితర పండుగ నేపథ్యంలో బ్యాంకులు మూతపడనున్నాయి.
మార్చి నెలలో బ్యాంకు సెలవుల వివరాలు
మార్చి 1 ఆదివారం : దేశమంతటా సాధారణ వారాంతపు సెలవు.
మార్చి 2 : హోలికా దహన్ సందర్భంగా యూపీలో బ్యాంకులు బంద్.
మార్చి 3 : హోలీ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింతో పాటు పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
మార్చి 4 : హోలీ సందర్భంగా త్రిపుర, గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకుల మూసివేత.
మార్చి 8 ఆదివారం : దేశవ్యాప్తంగా సెలవు.
మార్చి 13 : చప్కార్ కత్ పండుగ సందర్భంగా మిజోరంలో బ్యాంకులకు హాలీడే.
మార్చి 14 రెండో శనివారం : దేశమంతటా బ్యాంకులు మూసివేత.
మార్చి 15 ఆదివారం : బ్యాంకులకు హాలీడే.
మార్చి 17 : షాబ్ ఈ ఖాదర్ సందర్భంగా బ్యాంకులు పని చేయవు.
మార్చి 19 : ఉగాది, గుడిపడ్వా పండగ సందర్భంగా మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.
మార్చి 20 : రంజాన్ ముగింపు వేడుకల సందర్భంగా జమ్మూ కశ్మీర్, కేరళ, ఏపీలో బ్యాంకులకు సెలవులు.
మార్చి 21 : రంజాన్-ఈద్, సర్హుల్ పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు.
మార్చి 22 ఆదివారం : దేశవ్యాప్తంగా సెలవు.
మార్చి 26 : శ్రీ రామనవమి సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్.
మార్చి 27 : శ్రీ రామనవమి సందర్భంగా పలుచోట్ల బ్యాంకుల మూసివేత.
మార్చి 28 నాలుగో శనివారం : దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
మార్చి 29 ఆదివారం : సాధారణ సెలవు.
మార్చి 31 : మహావీర్ జయంతి సందర్భంగా ఆర్‌బీఐ సెలవు ఇచ్చినా.. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు సేవలందిస్తాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి
ఆగస్టు 31, 2026

CM Revanth | ఒకే ఒక్కడు తెలంగాణను రూ.8.11లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
ఆగస్టు 31, 2026

Bathukamma Kunta | మళ్లీ బతుకమ్మ కుంట ఆక్రమణకు కుట్రలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●SCR | 17 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు.. 2023 కి.మీ. మేర విస్తరణ
- ●OTT | 5 కోట్ల బడ్జెట్ - 130 కోట్ల కలెక్షన్స్ - విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ... ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్
- ●CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి
- ●Indiramma Towers | నెరవేరిన సొంతింటి కల.. 7340 ఫ్లాట్ల కేటాయింపు
- ●Anupama Parameswaran | ఢీ డ్యాన్స్ షో జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ - బ్రేకప్ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ
- ●Saidabad Steel Bridge | ప్రభుత్వ కట్టడాలకు అగ్రకులాల పేర్లు పెట్టడం అన్యాయం

SCR | 17 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు.. 2023 కి.మీ. మేర విస్తరణ

OTT | 5 కోట్ల బడ్జెట్ - 130 కోట్ల కలెక్షన్స్ - విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ... ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్

CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి

Indiramma Towers | నెరవేరిన సొంతింటి కల.. 7340 ఫ్లాట్ల కేటాయింపు



