త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market | స్టాక్ మార్కెట్ల‌లో అస్థిర‌త ఉన్నా.. బ్రోకరేజీల ఫేవరెట్ షేర్లు ఇవే..

Stock Market | మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరత మధ్య కూడా వినియోగం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిటైల్, సిమెంట్ రంగాలకు చెందిన కొన్ని ఎంపిక చేసిన షేర్లపై బ్రోకరేజీ సంస్థలు ఆశావహంగా ఉన్నాయి. ప్రముఖ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ షేర్లలో ప్రస్తుత స్థాయిల నుంచి గణనీయమైన పెరుగుదల అవకాశాలు కనిపిస్తున్నాయి.

S

Business | Published On May 29, 2026, 2.24 pm IST

Stock Market | స్టాక్ మార్కెట్ల‌లో అస్థిర‌త ఉన్నా.. బ్రోకరేజీల ఫేవరెట్ షేర్లు ఇవే..
Advertisement

Stock Market | మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరత మధ్య కూడా వినియోగం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిటైల్, సిమెంట్ రంగాలకు చెందిన కొన్ని ఎంపిక చేసిన షేర్లపై బ్రోకరేజీ సంస్థలు ఆశావహంగా ఉన్నాయి. ప్రముఖ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ షేర్లలో ప్రస్తుత స్థాయిల నుంచి గణనీయమైన పెరుగుదల అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సిఫార్సు చేసిన కొన్ని స్టాక్స్‌ను పరిశీలిస్తే.. ఎలారా సెక్యూరిటీస్ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు బై రేటింగ్‌ను కొనసాగించింది. ఈ స్టాక్‌కు రూ.46వేల టార్గెట్ ధరను నిర్ణయించింది. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.38,320 వద్ద ఉండగా, దాదాపు 20 శాతం వరకు పెరుగుదల అవకాశముందని అంచనా వేసింది.

ఐటీసీ షేర్‌కు మోర్గాన్ స్టాన్లీ ఈక్వల్-వెయిట్ రేటింగ్ ఇచ్చింది. ఈ స్టాక్‌కు రూ.346 టార్గెట్ ధరను నిర్దేశించింది. ప్రస్తుతం మార్కెట్ ధర రూ.308గా ఉండగా, సుమారు 12 శాతం అప్‌సైడ్ అవకాశాన్ని సూచించింది. జేకే లక్ష్మీ సిమెంట్ కు ఎలారా సెక్యూరిటీస్ అక్యుములేట్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈ షేర్‌కు రూ.734 టార్గెట్ ధరను నిర్ణయించగా, ప్రస్తుత ధర రూ.620గా ఉంది. దీంతో సుమారు 18 శాతం వరకు పెరుగుదల అవకాశముందని పేర్కొంది. నైకాకు నువామా తన బై కాల్‌ను పునరుద్ఘాటించింది. ఈ షేర్‌కు రూ.321 టార్గెట్ ధరను నిర్ణయించింది. ప్రస్తుతం స్టాక్ రూ.274 వద్ద ట్రేడవుతుండగా, దాదాపు 17 శాతం అప్‌సైడ్ అవకాశం ఉందని తెలిపింది.

పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్ కు యాక్సిస్ సెక్యూరిటీస్ బై సిఫార్సును కొనసాగించింది. ఈ స్టాక్‌కు రూ.245 టార్గెట్ ధరను నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్ ధర రూ.212గా ఉండగా, దాదాపు 15 శాతం వరకు పెరుగుదల అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే స్టాక్స్‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు పెట్టుబ‌డిదారులు నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

Advertisement
Advertisement