Page Industries | పేజ్ ఇండస్ట్రీస్ షేర్‌కు రూ.150 డివిడెండ్.. తేదీ ఎప్పుడంటే..?
Page Industries | పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కంపెనీ నికర లాభం 4 శాతం, ఆదాయం 11.5 శాతం పెరిగినప్పటికీ, నిర్వహణ మార్జిన్లు తగ్గడం, అమ్మకాల పరిమాణంలో ఆశించిన వృద్ధి లేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి.
Page Industries | పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కంపెనీ నికర లాభం 4 శాతం, ఆదాయం 11.5 శాతం పెరిగినప్పటికీ, నిర్వహణ మార్జిన్లు తగ్గడం, అమ్మకాల పరిమాణంలో ఆశించిన వృద్ధి లేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. మరోవైపు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.150 రెండో మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
ఆదాయం పెరిగినా తగ్గిన షేర్ ధర..
ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన క్యూ2 ఆర్థిక ఫలితాలను ప్రకటించిన వెంటనే షేరు ధర 10 శాతం పడిపోయి రోజువారీ లోయర్ సర్క్యూట్ ధర రూ.32,915కు చేరింది. అంతకుముందు రూ.36,505 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన షేరు ధర కొంతసేపు పరిమిత శ్రేణిలో కదిలినప్పటికీ, ఫలితాల ప్రకటన తర్వాత తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైంది. కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, క్యూ2లో నికర లాభం గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.194.76 కోట్ల నుంచి 4 శాతం పెరిగి రూ.202.5 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 11.5 శాతం వృద్ధితో రూ.1,439.6 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో ఈ ఆదాయం రూ.1,290.86 కోట్లుగా నమోదైంది. ఈబీఐటీడీఏ 7.4 శాతం పెరిగి రూ.300.1 కోట్లకు చేరినప్పటికీ, మార్జిన్ 21.6 శాతం నుంచి 20.8 శాతానికి తగ్గింది. త్రైమాసికంలో 5.5 శాతం వృద్ధితో 5.97 కోట్ల యూనిట్ల ఉత్పత్తుల విక్రయాలు నమోదయ్యాయి.
ముడి సరుకుల ధరల పెరుగుదలే కారణమా..?
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీ రూ.395.4 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం దాదాపు స్థిరంగా ఉంది. ఈ కాలంలో ఆదాయం 9.7 శాతం పెరిగి రూ.2,860.1 కోట్లకు చేరింది. పత్తి ధరలు అధికంగా ఉండడంతోపాటు ముడి చమురు ఆధారిత ముడిసరుకుల ధరలు కూడా గతంతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ముడిసరుకుల ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు తొలి త్రైమాసికంలో ధరలను పెంచినట్లు తెలిపింది. మరోవైపు, మిరాయ్ అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ థామస్ అబ్రహం స్పందిస్తూ.. కంపెనీ మార్జిన్లు 19-21 శాతం మార్గదర్శక పరిధిలోనే ఉన్నప్పటికీ, నిర్వహణ ఖర్చులను సమర్థవంతంగా భరించేందుకు అమ్మకాల పరిమాణంలో మరింత వృద్ధి అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధించాలన్న యాజమాన్య లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెండో అర్ధభాగంలో విక్రయాలు గణనీయంగా పెరగాల్సి ఉంటుందని విశ్లేషించారు.
కాగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.150 రెండో మధ్యంతర డివిడెండ్‌ను పేజ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఈ డివిడెండ్ పొందేందుకు అర్హులైన వాటాదారులను నిర్ణయించే రికార్డు తేదీగా నవంబర్ 18ను ఖరారు చేసింది. అర్హులైన వాటాదారులకు డిసెంబర్ 11వ తేదీలోగా డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mahesh Goud | రాహుల్ గాంధీ పక్కన పరుగెత్తడం నా అదృష్టం
- ●Ashok Galla | అచ్చ తెలుగు హీరోయిన్‌తో మహేష్‌బాబు మేనల్లుడి మూవీ - షూటింగ్ మొత్తం అమెరికాలోనే!
- ●Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?
- ●Microsoft | 36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ
- ●Mujeeb | మైనారిటీలకు 1000 కోట్లిస్తమన్నరు.. కానీ 10 రూపాలు కూడా అందలే
- ●TRAI | స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..

Mahesh Goud | రాహుల్ గాంధీ పక్కన పరుగెత్తడం నా అదృష్టం

Ashok Galla | అచ్చ తెలుగు హీరోయిన్‌తో మహేష్‌బాబు మేనల్లుడి మూవీ - షూటింగ్ మొత్తం అమెరికాలోనే!

Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?

Microsoft | 36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ





