త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మళ్లీ మొద‌లైన అమెరికా-ఇరాన్ యుద్ధం.. రేపు మార్కెట్ల‌లో భారీ ప‌త‌నం త‌ప్ప‌దా..?

Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు కొన‌సాగి యుద్ధం ముగుస్తుంద‌ని పెట్టుబ‌డిదారులు ఆశిస్తే ప్ర‌స్తుతం ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ‌త రెండు మూడు రోజుల నుంచి ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల హ‌డావిడి కొన‌సాగినా ఎట్ట‌కేల‌కు ఒప్పందం కుదిరే అవ‌కాశాలు లేవ‌ని తేల‌డంతో మార్కెట్ల‌లో మ‌ళ్లీ ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

S

Business | Published On May 28, 2026, 10.35 am IST

Stock Markets | మళ్లీ మొద‌లైన అమెరికా-ఇరాన్ యుద్ధం.. రేపు మార్కెట్ల‌లో భారీ ప‌త‌నం త‌ప్ప‌దా..?
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు కొన‌సాగి యుద్ధం ముగుస్తుంద‌ని పెట్టుబ‌డిదారులు ఆశిస్తే ప్ర‌స్తుతం ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ‌త రెండు మూడు రోజుల నుంచి ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల హ‌డావిడి కొన‌సాగినా ఎట్ట‌కేల‌కు ఒప్పందం కుదిరే అవ‌కాశాలు లేవ‌ని తేల‌డంతో మార్కెట్ల‌లో మ‌ళ్లీ ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. మ‌రోవైపు ఇరు దేశాలు మ‌ళ్లీ యుద్ధం మొద‌లు పెట్ట‌డంతో ఆ ప్ర‌భావం ఈక్విటీ మార్కెట్ల‌పై స్ప‌ష్టంగా క‌నిపించింది. గ‌త సెష‌న్‌లో అమెరికా మార్కెట్లు స్వ‌ల్ప లాభాల్లో ముగిసినా గురువారం ఆసియా మార్కెట్లు మాత్రం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. బ‌క్రీద్ కావ‌డంతో దేశీయ మార్కెట్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

గిఫ్ట్ నిఫ్టీ భారీగా ప‌త‌నం..

జ‌పాన్ నిక్కీ225 సూచీ ఏకంగా 1వేయి పాయింట్ల‌కు పైగా ప‌త‌నం కాగా, ద‌క్షిణ కొరియా కోస్పి సూచీ 300 పాయింట్లు క్షీణించింది. షాంఘై ఇండెక్స్ స్వ‌ల్ప న‌ష్టాల్లో కొన‌సాగుతుండ‌గా, హాంగ్ సెంగ్ 600 పాయింట్ల‌కు పైగా ప‌త‌న‌మైంది. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 సూచీ 140 పాయింట్లు ప‌డిపోయింది. ఇక గురువారం బ‌క్రీద్ కార‌ణంగా దేశీయ మార్కెట్ల‌కు సెల‌వు అయిన‌ప్ప‌టికీ విదేశీ నిఫ్టీ సూచీ గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఓపెన్ ఉంది. ఈ క్ర‌మంలో ఆ సూచీ క్రితం సెష‌న్ ముగింపుతో పోలిస్తే 400 పాయింట్ల‌కు పైగా ప‌త‌న‌మైంది. అయితే దేశీయ మార్కెట్ల‌కు సెల‌వు అయినందున ఇవాళ ఆ ప్ర‌భావం భార‌త్‌లో క‌నిపించ‌డం లేదు. కానీ శుక్ర‌వారం మార్కెట్ల‌లో బ్ల‌డ్ బాత్ ఖాయ‌మ‌ని, సూచీలు భారీగా ప‌త‌న‌మ‌వుతాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. శుక్ర‌వారం నాడు నిఫ్టీ50 సూచీ 500 పాయింట్ల‌కు దిగువ‌న‌, సెన్సెక్స్ 2వేల పాయింట్ల‌కు దిగువ‌న ఓపెన్ అయ్యే చాన్స్‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌ల అవ‌కాశాలు దెబ్బ తిన‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. దీంతో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై మ‌రింత ఎక్కువ ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement