Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనేందుకు ఇది సమయమేనా..?
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు కొనసాగే అవకాశం లేకపోవడం, ఒప్పందం కుదరకపోవడంతోపాటు మళ్లీ ఇరు దేశాల మధ్య నెమ్మదిగా యుద్ధం మొదలవుతుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఆ ప్రభావం కమోడిటీపై కూడా పడింది.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు కొనసాగే అవకాశం లేకపోవడం, ఒప్పందం కుదరకపోవడంతోపాటు మళ్లీ ఇరు దేశాల మధ్య నెమ్మదిగా యుద్ధం మొదలవుతుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఆ ప్రభావం కమోడిటీపై కూడా పడింది. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1.39 శాతం పతనమై 4,393 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.96 శాతం మేర పతనమై 73.14 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌కు గురువారం బక్రీద్ కావడంతో సెలవు ఇచ్చారు. అయితే క్రితం సెషన్ ముగింపును చూస్తే గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1989 పాయింట్లు పతనమై 1,55,627 వద్ద నిలిచింది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,416 పాయింట్లు పతనమై 2,66,212 వద్ద స్థిరపడింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,606 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 848 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,56,060 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,60,600 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.22,300 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,305 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,440గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,050 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,30,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.20,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,704 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,63గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,17,040 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,70,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.16,800 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,85,000 ఉండగా, తులం ధర రూ.2,850 గా ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Split | స్టాక్ స్ప్లిట్ ఎఫెక్ట్.. రూ.222 షేర్ ధర రూ.44కి పతనం..
- ●PM Modi | ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
- ●Grey Jungle fowl | అరుదైన అడవి కోడి.. తిన్నారో జైలు పాలే.. ఇంతకి అదెక్కడుంటుందంటే..
- ●SEBI | మార్కెట్‌లో భారీ ఊగిసలాటలకు చెక్.. సెబీ కొత్త ప్లాన్..
- ●Minister Vivek | బాల్క సుమన్ వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి వివేక్
- ●Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ - ఆత్మలతో అంబులెన్స్ డ్రైవర్ ఫ్రెండ్షిప్

Stock Split | స్టాక్ స్ప్లిట్ ఎఫెక్ట్.. రూ.222 షేర్ ధర రూ.44కి పతనం..

PM Modi | ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

Grey Jungle fowl | అరుదైన అడవి కోడి.. తిన్నారో జైలు పాలే.. ఇంతకి అదెక్కడుంటుందంటే..

SEBI | మార్కెట్‌లో భారీ ఊగిసలాటలకు చెక్.. సెబీ కొత్త ప్లాన్..






