త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం ఎప్ప‌టికీ చెరిగిపోదు: చిరంజీవి

Chiranjeevi | మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ (NTR) 103వ జ‌యంతి సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఘ‌నంగా నివాళులు అర్పించారు.

G

Movies | Published On May 28, 2026, 10.57 am IST

Chiranjeevi | ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం ఎప్ప‌టికీ చెరిగిపోదు: చిరంజీవి
Advertisement

Chiranjeevi | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ (NTR) 103వ జ‌యంతి సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదంటూ ఎక్స్ వేదిక‌గా ట్వీట్‌ చేశారు.

‘ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా.. ప్రజా జీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా.. అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయులు. ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.

ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్ గార్డెన్‌లో న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr. NTR) నివాళులు అర్పించారు. గురువారం ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు చేరుకున్న ఎన్టీఆర్‌.. త‌న‌ తాత స‌మాధి వ‌ద్ద పుష్పాంజ‌లి ఘ‌టించారు.

తెలుగువారంద‌రిపై ఎన్టీఆర్ ఆశీర్వాదం: పురందేశ్వరి

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వ‌రి (Purandeshwari), వెంకటేశ్వరరావు దంపతులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. తెలుగువారు ఎక్కడున్నా అందరిపై ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు. ప్రజా నాయకుడిగా రాజకీయాలంటే ప్రజా సేవ అని ఎన్టీఆర్ రుజువు చేశారన్నారు. ఎన్టీఆర్ ది మరణం లేని జననమని.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని చెప్పారు.

Advertisement
Advertisement