త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | సిద్ధ‌రామ‌య్య రాజీనామా ప్ర‌క‌ట‌న‌.. భావోద్వేగంతో సీఎం కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకున్న డీకే శివ‌కుమార్‌

DK Shivakumar | ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య (Siddaramaiah)తో ఉప‌ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ (Breakfast Meeting) నిర్వ‌హించారు. బెంగ‌ళూరులోని ముఖ్య‌మంత్రి అధికారిక నివాసం కావేరిలో సీఎంతో డీకే భేటీ అయ్యారు.

D

National | Published On May 28, 2026, 11.06 am IST

DK Shivakumar | సిద్ధ‌రామ‌య్య రాజీనామా ప్ర‌క‌ట‌న‌.. భావోద్వేగంతో సీఎం కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకున్న డీకే శివ‌కుమార్‌
Advertisement

DK Shivakumar | క‌ర్ణాట‌క రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. అక్క‌డ అధికార మార్పిడికి రంగం సిద్ధ‌మైనట్లుగా తెలుస్తోంది. ఇవాళ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి సిద్ధ‌రామ‌య్య (Siddaramaiah) రాజీనామా చేసే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాల మ‌ధ్య సీఎం సిద్ధూతో ఉప‌ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ (Breakfast Meeting) నిర్వ‌హించారు. బెంగ‌ళూరులోని ముఖ్య‌మంత్రి అధికారిక నివాసం కావేరిలో సీఎంతో డీకే భేటీ అయ్యారు.

రాజీనామా చేస్తున్నా..

ఈ భేటీ అనంత‌రం డీకే భావోద్వేగంతో సిద్ధ‌రామ‌య్య కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంత‌రం ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో, బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలో ఏం జ‌రిగింద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు క్యాబినెట్ మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ మీటింగ్‌లో తాను సీఎంగా రాజీనామా చేస్తున్న‌ట్లు సిద్ధ‌రామ‌య్య ప్ర‌క‌టించారు. త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నేదానిపై హైక‌మాండ్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రుల‌కు వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఆయ‌న‌ రాజీనామా చేసే అవ‌కాశం ఉంది. అయితే, ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ బెంగ‌ళూరులో లేరు. దీంతో ఆయ‌న రాజీనామా ఎప్పుడు స‌మ‌ర్పిస్తార‌న్న‌దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది.

డీకే ఇంటి వ‌ద్ద భ‌ద్ర‌త పెంపు..

ఇదిలా ఉండ‌గా.. శ‌నివారం నూత‌న ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌ని స‌మాచారం. క‌ర్ణాట‌క తదుప‌రి ముఖ్య‌మంత్రిగా డీకే శివ‌కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఈ నేప‌థ్యంలో డీకే ఇంటి వ‌ద్ద పోలీసులు భ‌ద్ర‌త‌ను పెంచారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మ‌రోవైపు న‌గ‌రంలో డీకే పోస్ట‌ర్లు వెలిశాయి.

రెండేళ్లూ ఎమ్మెల్యేగానే సిద్దూ

మ‌రోవైపు సిద్ధ‌రామ‌య్య‌కు కాంగ్రెస్ అధిష్టానం రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేసిందంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం అలాంటిదేమీ లేద‌ట‌. సిద్ధ‌రామ‌య్య ఈ రెండేళ్లూ ఎమ్మెల్యేగానే కొన‌సాగనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

Advertisement
Advertisement