Amazon Echo | అమెజాన్ నుంచి కొత్త ఎకో స్పీకర్లు.. భారత్‌లో విడుదల..
Amazon Echo | అమెజాన్ సంస్థ భారత్ లో తన ఎకో స్మార్ట్ స్పీకర్ లైనప్‌ను విస్తరించింది. కంపెనీ తాజాగా ఎకో డాట్ మ్యాక్స్, ఎకో స్టూడియో పేరుతో రెండు కొత్త స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లలో అప్‌గ్రేడ్ చేసిన ఆడియో హార్డ్‌వేర్, స్మార్ట్ హోమ్ హబ్ ఫీచర్లు, కొత్త కనెక్టివిటీ స్టాండర్డ్స్, హోమ్ థియేటర్ సపోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
Technology | Published On May 28, 2026, 10.55 am IST
Amazon Echo | అమెజాన్ సంస్థ భారత్ లో తన ఎకో స్మార్ట్ స్పీకర్ లైనప్‌ను విస్తరించింది. కంపెనీ తాజాగా ఎకో డాట్ మ్యాక్స్, ఎకో స్టూడియో పేరుతో రెండు కొత్త స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లలో అప్‌గ్రేడ్ చేసిన ఆడియో హార్డ్‌వేర్, స్మార్ట్ హోమ్ హబ్ ఫీచర్లు, కొత్త కనెక్టివిటీ స్టాండర్డ్స్, హోమ్ థియేటర్ సపోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎకో డాట్ మ్యాక్స్ అమెజాన్ నుంచి వచ్చిన తాజా ఎకో డాట్ స్పీకర్. ఇందులో రీడిజైన్ చేసిన టూ-వే స్పీకర్ సిస్టమ్‌ను అందించారు. డీప్ బాస్ కోసం హై-ఎక్సర్షన్ వూఫర్, క్లియర్ హై ఫ్రీక్వెన్సీ ఆడియో కోసం కస్టమ్ ట్వీటర్‌ను ఉపయోగించారు. ఈ స్పీకర్ ఎకో డాట్ 5వ జనరేషన్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ బాస్‌ను అందిస్తుంది. కొత్త ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ వల్ల గత మోడల్‌తో పోలిస్తే రెట్టింపు ఎయిర్ స్పేస్ లభించడంతో బాస్ పనితీరు మరింత మెరుగుపడిందని కంపెనీ తెలిపింది. ఈ స్పీకర్ గది ఆకస్టిక్స్‌ను బట్టి ఆటోమేటిక్‌గా ఆడియో అవుట్‌పుట్‌ను అడ్జస్ట్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా బిల్ట్-ఇన్ స్మార్ట్ హోమ్ హబ్‌తో వచ్చిన తొలి ఎకో డాట్ మోడల్ ఇదే కావడం విశేషం.
ఎకో డాట్ మ్యాక్స్ ముఖ్య స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. రూమ్ ఫిల్లింగ్ రిచ్ సౌండ్, 0.8 అంగుళాల ట్వీటర్, 2.5 అంగుళాల వూఫర్, లాస్‌లెస్ హై డెఫినిషన్ ఆడియో, ఆటోమేటిక్ రూమ్ అడాప్టేషన్, 4 మైక్రోఫోన్ అరే, ఆడియో బ్యాండ్‌విడ్త్: 53 హెడ్జ్ - 16 కిలోహెడ్జ్, ఏజెడ్3 చిప్‌సెట్, బిల్ట్-ఇన్ స్మార్ట్ హోమ్ హబ్, ఓమ్నిసెన్స్ సపోర్ట్, అలెక్సా బిల్ట్-ఇన్, వై-ఫై 6ఈ సపోర్ట్, బ్లూటూత్ 5.3, బ్లూటూత్ లో ఎనర్జీ సపోర్ట్ వంటి ఫీచర్లను ఇందులో ఇచ్చారు.
ఎకో స్టూడియో ఫీచర్లు..
ఎకో స్టూడియోలో రూమ్ అడాప్టింగ్ స్పేషియల్ ఆడియోతోపాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అందించారు. ఇందులో హై-ఎక్సర్షన్ వూఫర్‌తోపాటు మూడు ఫుల్-రేంజ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇవి క్లారిటీ, డెప్త్‌తో కూడిన వైడ్ ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తాయి. అమెజాన్ ఈ మోడల్‌కు కాంపాక్ట్ స్ఫీరికల్ డిజైన్‌ను ఇచ్చింది. 3డీ నిట్ ఫ్యాబ్రిక్ ఫినిష్‌తో రూపొందించిన ఈ డిజైన్ ఆకస్టిక్ ట్రాన్స్‌పరెన్సీని మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది. అమెజాన్ స్పేషియల్ ఆడియో విత్ డాల్బీ అట్మాస్, 3.75 అంగుళాల హై-ఎక్సర్షన్ వూఫర్, 3 ఫుల్-రేంజ్ డ్రైవర్లు, డిస్టోర్షన్ రిడక్షన్ సపోర్ట్, లాస్‌లెస్ హై డెఫినిషన్ ఆడియో, ఆటోమేటిక్ రూమ్ అడాప్టేషన్, 4 మైక్రోఫోన్ అరే, ఆడియో బ్యాండ్‌విడ్త్: 30 హెడ్జ్ - 18 కిలోహెడ్జ్, ఏజెడ్3 ప్రో చిప్‌సెట్, బిల్ట్-ఇన్ స్మార్ట్ హోమ్ హబ్, ఓమ్నిసెన్స్ సపోర్ట్, అలెక్సా బిల్ట్-ఇన్, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 సపోర్ట్ వంటి ఫీచర్లను ఇందులో ఇచ్చారు.
కామన్ ఫీచర్లు ఇవే..
ఈ రెండు స్పీకర్లలోనూ అలెక్సా బిల్ట్-ఇన్‌గా ఉంటుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా మ్యూజిక్, పోడ్‌కాస్ట్స్, ఆడియోబుక్స్ ప్లే చేయడం, స్మార్ట్ హోమ్ డివైసెస్‌ను కంట్రోల్ చేయడం, టైమర్స్, అలార్మ్స్ సెట్ చేయడం, వెదర్ చెక్ చేయడం, షాపింగ్ లిస్ట్స్ తయారు చేయడం వంటి పనులు చేయవచ్చు. అమెజాన్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్, ఆడిబుల్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులకు కూడా సపోర్ట్ అందించారు. ఓమ్నిసెన్స్ యాంబియంట్ ఏఐ టెక్నాలజీ ద్వారా ఆటోమేటెడ్ స్మార్ట్ హోమ్ అనుభవాలను అందిస్తాయి. ప్రెజెన్స్, మోషన్, టెంపరేచర్ డిటెక్షన్ ఆధారంగా ఆటోమేటిక్ రొటీన్స్ సెట్ చేయవచ్చు. ఆడియో సెన్సింగ్, అల్ట్రాసౌండ్, వై-ఫై రాడార్, యాక్సిలరోమీటర్ ఆధారిత స్మార్ట్ సెన్సింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. లైట్స్, ఏసీలు, ఫ్యాన్స్, ప్లగ్స్ వంటి అలెక్సా కంపాటిబుల్ డివైసెస్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ స్పీకర్లు వై-ఫై, జిగ్బీ, థ్రెడ్, మ్యాటర్, బ్లూటూత్ కనెక్టివిటీ స్టాండర్డ్స్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఎకో డాట్ మ్యాక్స్‌లో ఏజెడ్3 చిప్, ఎకో స్టూడియోలో ఏజెడ్3 ప్రో చిప్ ఇచ్చారు.
ధర ఎంతంటే..
అలెక్సా వేక్-వర్డ్ డిటెక్షన్‌లో దాదాపు 50 శాతం మెరుగుదల వచ్చినట్లు అమెజాన్ తెలిపింది. కన్వర్సేషన్ డిటెక్షన్ సామర్థ్యాలు కూడా అప్‌గ్రేడ్ అయ్యాయి. కంపాటిబుల్ ఫైర్ టీవీ స్టిక్స్‌తో కలిసి ఐదు వరకు ఎకో డివైసెస్‌ను పెయిర్ చేసి అలెక్సా హోమ్ థియేటర్ అనుభవాన్ని పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ప్రైవసీ కోసం మైక్రోఫోన్ ఆఫ్ బటన్, అలెక్సా యాప్ ద్వారా వాయిస్ రికార్డింగ్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఇండియాలో అలెక్సా ప్లస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనరేటివ్ ఏఐ ఫీచర్లకు కూడా ఈ స్పీకర్లు సపోర్ట్ చేయనున్నాయి. ఎకో డాట్ మ్యాక్స్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. ఇది గ్రాఫైట్, అమెథిస్ట్, గ్లేసియర్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఎకో స్టూడియో ధర రూ.23,999గా ఉంది. ఇది గ్రాఫైట్, గ్లేసియర్ వైట్ కలర్స్‌లో లభిస్తోంది. ఈ రెండు స్పీకర్లను అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే ప్రైమ్ మెంబర్స్‌కు 5 శాతం క్యాష్‌బ్యాక్‌తోపాటు ఫ్రీ, ఫాస్ట్ డెలివరీ కూడా లభిస్తుంది.
తాజావార్తలు
- ●BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు
- ●Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి
- ●Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి
- ●Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ - విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
- ●YouTube | యూట్యూబ్‌లో వీడియోలకు కొత్త లేబుల్స్.. ఏఐ కంటెంట్ అయితే వెంటనే చెప్పేస్తుంది..
- ●CUET UG | సీయూఈటీ యూజీ రీషెడ్యూల్.. వాయిదా పడిన పరీక్షలు ఈ తేదీల్లో..

BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు

Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి

Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి

Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ - విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్



