త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market Update | నిఫ్టీ 1243, సెన్సెక్స్ 3692 పాయింట్లు గ్యాప్‌-అప్‌.. భారీ లాభాల్లో మార్కెట్లు..

Stock Market Update | భారత్‌పై విధించిన ప‌ర‌స్ప‌ర టారిఫ్‌ల‌ను 25 నుంచి 18 శాతానికి త‌గ్గిస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ల‌కు ఊపు ల‌భించింది. సోమ‌వారం రాత్రే ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డంతో విదేశీ నిఫ్టీ సూచీ GIFT NIFTY ఉద‌య‌మే పాజిటివ్ సంకేతాల‌ను ఇచ్చింది.

S

Business | Published On Feb 3, 2026, 9.44 am IST

Stock Market Update | నిఫ్టీ 1243, సెన్సెక్స్ 3692 పాయింట్లు గ్యాప్‌-అప్‌.. భారీ లాభాల్లో మార్కెట్లు..
Advertisement

Stock Market Update | భారత్‌పై విధించిన ప‌ర‌స్ప‌ర టారిఫ్‌ల‌ను 25 నుంచి 18 శాతానికి త‌గ్గిస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ల‌కు ఊపు ల‌భించింది. సోమ‌వారం రాత్రే ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డంతో విదేశీ నిఫ్టీ సూచీ GIFT NIFTY ఉద‌య‌మే పాజిటివ్ సంకేతాల‌ను ఇచ్చింది. ఏకంగా 800 పాయింట్ల మేర నిఫ్టీ గ్యాప్ అప్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు GIFT NIFTY సూచీ తెలియజేసింది. అయితే అనుకున్న విధంగానే నిఫ్టీతోపాటు సెన్సెక్స్ కూడా భారీ గ్యాప్‌-అప్‌తో ఓపెన్ అయ్యాయి. సోమ‌వారం సెష‌న్ ముగిసే స‌మ‌యానికి నిఫ్టీ 25,081 వ‌ద్ద క్లోజ్ అవ‌గా, సెన్సెక్స్ 81,631 వ‌ద్ద క్లోజ్ అయింది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం 9:15 గంట‌ల‌కు సెష‌న్‌లో ఈ రెండు సూచీలు భారీ గ్యాప్‌-అప్‌తో ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 26,324 వ‌ద్ద ఓపెన్ అవ‌గా ఏకంగా 1243 పాయింట్ల గ్యాప్‌-అప్‌ను న‌మోదు చేసింది. అలాగే సెన్సెక్స్ 85,323 వ‌ద్ద ఓపెన్ అవ‌గా ఏకంగా 3692 పాయింట్ల గ్యాప్-అప్‌ను న‌మోదు చేసింది.

ట్రంప్ టారిఫ్ ల‌ను త‌గ్గించిన నేప‌థ్యంలో ఈ ప్ర‌భావం ప్రపంచ మార్కెట్లపై కూడా పాజిటివ్‌గానే క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే ట్రంప్ నిర్ణ‌యం విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్ల‌ను (ఎఫ్ఐఐ)ల‌ను ఆక‌ర్షిస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అందులో భాగంగానే సూచీలు భారీ గ్యాప్‌-అప్‌ల‌ను న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. అయితే నిఫ్టీ గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి 26,000 పాయింట్ల మార్క్ వ‌ద్ద కాస్త అటు ఇటుగా ఊగిస‌లాడుతోంది. ఇప్పుడు కూడా అక్క‌డే ఓపెన్ అయింది. కానీ ఆ మార్కును మించి ముందుకు సాగ‌డం లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టారిఫ్‌లు, ట్రేడ్ డీల్ విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొన‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని అర్థం అవుతోంది. కానీ ఇప్పుడు ఒక స్ప‌ష్టత వ‌చ్చింది క‌నుక నిఫ్టీ మ‌రి కొద్ది రోజుల్లోనే 27,000 మార్క్‌ను అందుకుని మ‌ళ్లీ ఆల్ టైం హై రికార్డును న‌మోదు చేస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement