త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SpaceX | జోష్ చల్లారిందా? స్పేస్‌ఎక్స్‌కు భారీ షాక్.. 600 బిలియన్ డాలర్లు ఆవిరి..

SpaceX | ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోగా నిలిచిన స్పేస్ఎక్స్ (SpaceX) షేర్లలో ప్రారంభ ఉత్సాహం క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు వరుసగా భారీ పతనాన్ని నమోదు చేయడంతో సంస్థ మార్కెట్ విలువ 600 బిలియన్ డాల‌ర్ల‌కు పైగా తగ్గింది.

S

Business | Published On Jun 23, 2026, 1.59 pm IST

SpaceX | జోష్ చల్లారిందా? స్పేస్‌ఎక్స్‌కు భారీ షాక్.. 600 బిలియన్ డాలర్లు ఆవిరి..
Advertisement

SpaceX | ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోగా నిలిచిన స్పేస్ఎక్స్ (SpaceX) షేర్లలో ప్రారంభ ఉత్సాహం క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు వరుసగా భారీ పతనాన్ని నమోదు చేయడంతో సంస్థ మార్కెట్ విలువ 600 బిలియన్ డాల‌ర్ల‌కు పైగా తగ్గింది. రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్లు సమీకరించిన ఐపీవోలో షేరు ధరను 135 డాలర్లుగా నిర్ణయించారు. జూన్ 12న మార్కెట్లో లిస్టింగ్ అనంతరం షేర్లు వేగంగా దూసుకెళ్లి, కొద్ది రోజుల్లోనే 60 శాతం వరకు లాభాలను నమోదు చేశాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ తాత్కాలికంగా 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే కంపెనీ సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన బాండ్ ఇష్యూ ద్వారా రుణ సమీకరణకు సిద్ధమవుతోందన్న వార్తలు వెలువడిన తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో విక్రయాల ఒత్తిడి పెరిగి షేర్లు వరుసగా పడిపోతున్నాయి.

2.04 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా క్యాపిట‌లైజేష‌న్‌..

క్రితం సెష‌న్‌లో ఒక్కరోజే స్పేస్‌ఎక్స్ షేరు 16 శాతం క్షీణించి 154.60 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజు పతనంతోనే కంపెనీ మార్కెట్ విలువలో దాదాపు 400 బిలియన్ డాలర్లకు పైగా కోత పడింది. ప్రస్తుతం సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 2.04 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐపీవో తర్వాత భారీగా కొనుగోళ్లు చేసిన పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాలను బుక్ చేసుకుంటుండటంతో షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింద‌ని చెప్పారు. షేర్ల సరఫరా పెరగడం, భవిష్యత్తులో లాక్-ఇన్ కాలం ముగియడం వంటి అంశాలు కూడా ఒడిదుడుకులకు కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ ఐపీవో ధరతో పోలిస్తే స్పేస్‌ఎక్స్ షేరు ఇంకా లాభాల్లోనే కొనసాగుతుండటం విశేషం.

Advertisement
Advertisement