త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Patnam Mahender Reddy | ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌ల‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ప‌ట్నం

MLC Patnam Mahender Reddy | రాష్ట్రంలో ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి తపిస్తుందని ఇందులో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.

S

Telangana | Published On Jun 23, 2026, 3.48 pm IST

MLC Patnam Mahender Reddy | ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌ల‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ప‌ట్నం
Advertisement

MLC Patnam Mahender Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి తపిస్తుందని ఇందులో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ప‌ర్య‌టించిన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి.. ఎమ్మెల్సీ ద‌యానంద్, క‌మిష‌న‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి, జోన‌ల్ క‌మిష‌న‌ర్ రాధికా గుప్తాతో క‌లిసి ఇందిరా మ‌హిళా శ‌క్తి చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా సంఘాల టీ స్టాల్స్‌ను కూడా ప్రారంభించారు.

అనంత‌రం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సరూర్ నగర్ ప్రాంతాలకు చెందిన 5,62,421 మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరు గ్యారెంటీలలో మహిళ సాధికారిత‌ కోసం ప్రాధాన్యతనిస్తుంది. మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో 5,62,421 మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేస్తున్నాం. రేష‌న్ కార్డుల పంపిణీ, 200 యూనిట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాలో మ‌హిళ‌ల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, జాయింట్ జిల్లా కలెక్టర్ విజేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement