త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ మెరుపు దాడులు.. మ‌ల్లారెడ్డి నివాసంలో సోదాలు

ACB Raids | హైద‌రాబాద్‌లో మ‌రోసారి ఏసీబీ మెరుపు దాడుల‌కు (ACB Raids) దిగింది. ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ మ‌ల్లారెడ్డి (Excise Superintendent Mallareddy) నివాసంలో అధికారులు సోదాలు చేప‌ట్టారు.

D

Hyderabad | Published On Jun 23, 2026, 3.43 pm IST

ACB Raids | హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ మెరుపు దాడులు.. మ‌ల్లారెడ్డి నివాసంలో సోదాలు
Advertisement

ACB Raids | హైద‌రాబాద్‌లో మ‌రోసారి ఏసీబీ మెరుపు దాడుల‌కు (ACB Raids) దిగింది. ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ మ‌ల్లారెడ్డి (Excise Superintendent Mallareddy) నివాసంలో అధికారులు సోదాలు చేప‌ట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌తో కేసు న‌మోదు చేసిన ఏసీబీ అధికారులు ఈ మేర‌కు త‌నిఖీలు చేస్తున్నారు.

మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున నుంచే మల్లారెడ్డి ఇల్లు సహా బంధువులు, సన్నిహితుల నివాసాల్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. మొత్తం 10 ప్రాంతాల్లో ఏక‌కాలంలో సోదాలు కొన‌సాగుతున్నాయి. రికార్డులు, ఆస్తుల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, స్థిరాస్తులు, పెట్టుబ‌డుల‌పై ఆరా తీస్తున్నారు. ఈ సోదాల్లో కీల‌క ప‌త్రాల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సోదాలు కొన‌సాగుతున్నాయి. సోదాలు ముగిసిన త‌ర్వాత మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement