SpaceX | స్పేస్ఎక్స్ ఐపీఓలో మస్క్ మాస్టర్‌స్ట్రోక్.. బ్యాంకర్లకు రూ. 600 కోట్ల ఫీజు కూడా కట్..
SpaceX | ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచిన స్పేస్ ఎక్స్ (SpaceX) పబ్లిక్ ఆఫర్‌లో, సంస్థ ఇప్పటికే చాలా తక్కువ ఫీజులతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, మరోసారి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల నుంచి మరింత అనుకూలమైన షరతులను సాధించింది.
SpaceX | ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచిన స్పేస్ ఎక్స్ (SpaceX) పబ్లిక్ ఆఫర్‌లో, సంస్థ ఇప్పటికే చాలా తక్కువ ఫీజులతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, మరోసారి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల నుంచి మరింత అనుకూలమైన షరతులను సాధించింది. ఎలాన్ మస్క్ కు చెందిన రాకెట్, శాటిలైట్, ఏఐ సంస్థ స్పేస్‌ఎక్స్, ఐపీఓ అండర్‌రైటర్లు తమకు ఉన్న అదనపు 15 శాతం షేర్ల విక్రయ హక్కును వినియోగిస్తే ఎలాంటి అదనపు ఫీజు చెల్లించబోదని ఒప్పందం కుదుర్చుకుంది. వాల్ స్ట్రీట్ భాషలో దీనిని గ్రీన్‌షూ ఆప్షన్ అని పిలుస్తారు. ఈ అసాధారణ ఒప్పందం కారణంగా గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, ఇతర అండర్‌రైటింగ్ బ్యాంకులు కలిపి సుమారు 75 మిలియన్ డాలర్ల అదనపు ఫీజులను కోల్పోతున్నాయి. స్పేస్‌ఎక్స్ ఒప్పందంలో గ్రీన్‌షూ ఆప్షన్ ద్వారా అండర్‌రైటర్లు అదనంగా 11.25 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించే అవకాశం పొందారు. ఈ మొత్తం మాత్రమే ప్రపంచంలోని చాలా ఐపీఓల కంటే పెద్ద ఈక్విటీ సమీకరణగా నిలుస్తోంది. అలాంటి భారీ అదనపు విక్రయానికి కూడా బ్యాంకర్లు ఫీజు తీసుకోకుండా అంగీకరించడం మార్కెట్‌లో ఆశ్చర్యంగా మారింది.
స్పేస్ఎక్స్ షేర్ విలువ తగ్గనుందా..?
బ్యాంకర్లకు ఈ గ్రీన్‌షూ ఆప్షన్‌ను వినియోగించేందుకు 30 రోజుల సమయం ఉంది. ఈ విషయంపై మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మాన్ శాక్స్ ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించారు. కాగా కొందరు విశ్లేషకులు స్పేస్‌ఎక్స్ విలువపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్నింగ్‌స్టార్ సంస్థ ఐపీఓ అనంతరం స్పేస్‌ఎక్స్ విలువ 63 డాలర్ల స్థాయికి పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. మస్క్‌కు చెందిన ఈ సంస్థ ఐపీఓ కోసం డీల్‌మేకర్లకు మొత్తం 500 మిలియన్ డాలర్ల ఫీజు చెల్లించేందుకు అంగీకరించింది. ఇది 75 బిలియన్ డాలర్ల ఐపీఓ సమీకరణలో కేవలం 0.67 శాతం మాత్రమే. శాతం పరంగా ఇది చాలా తక్కువ అయినప్పటికీ, మొత్తంగా చూసినప్పుడు వాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద ఫీజు చెల్లింపులలో ఒకటిగా నిలిచింది. ప్రధాన లీడ్ బ్యాంకులుగా వ్యవహరించిన గోల్డ్‌మాన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ ఒక్కోటి సుమారు 100 మిలియన్ డాలర్ల ఫీజును పొందాయి.
సంప్రదాయానికి భిన్నంగా స్పేస్ ఎక్స్..
అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటి గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్ సంస్థలు తక్కువ స్థాయి పాత్రలు పోషించగా, ఒక్కోటి సుమారు 75 మిలియన్ డాలర్ల చొప్పున అందుకున్నాయి. మరోవైపు కో-మేనేజర్ పాత్ర మాత్రమే దక్కించుకున్న డజనుకు పైగా బ్యాంకులకు ఫీజు సుమారు 2 మిలియన్ డాలర్లకే పరిమితమైంది. సాధారణంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు ఐపీఓలపై 4 శాతం నుంచి 7 శాతం వరకు ఫీజులు వసూలు చేస్తాయి. భారీ ఐపీఓలలో ఈ శాతం తగ్గినా, సాధారణంగా 1 శాతం కంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే స్పేస్‌ఎక్స్ ఒప్పందం ఈ సంప్రదాయానికి భిన్నంగా నిలిచింది. ఇంతటితో ఆగని మస్క్, గ్రీన్‌షూ ఆప్షన్ సందర్భంగా గోల్డ్‌మాన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ బ్యాంకర్లను నిజంగానే ఆకుపచ్చ రంగు షూస్ ధరించాలని కోరాడు. అనంతరం కొత్తగా ట్రిలియనీర్‌గా నిలిచిన మస్క్, మోర్గాన్ స్టాన్లీ సీఈఓ టెడ్ పిక్ తో పాటు మస్క్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మైకేల్ గ్రిమ్స్ సహా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హల్క్ ఆకుపచ్చ రంగు స్నీకర్స్ ధరించి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు
- ●Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్
- ●Social Media | సోషల్ మీడియా కంటెంట్‌తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్‌టాక్‌పై కుటుంబాల న్యాయ పోరాటం..
- ●Alpha Trailer | అదిరిన ‘ఆల్ఫా’ ట్రైలర్.. యాక్షన్ మోడ్‌లో అలియా

Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?

Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు..

Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు

Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్






