Vakiti Srihari | ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి: మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతీ ఇంటికీ తీసుకెళ్లాలని రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి (Sports Minister) వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. క్రమశిక్షణతో కూడిన క్రీడాకారులే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని చెప్పుకొచ్చారు. మిలిటరీ సైనికులకు ఉన్నంత క్రమశిక్షణ క్రీడాకారులకు కూడా ఉండాలని సూచించారు.
Vakiti Srihari | ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతీ ఇంటికీ తీసుకెళ్లాలని రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి (Sports Minister) వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్-2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరం నలుమూలల నుంచి ఒలింపిక్ జ్యోతిని తీసుకొచ్చిన ప్రతి క్రీడాకారుడికి అభినందనలు తెలిపారు.
ప్రతి ఒక్కరిలో ఒలింపిక్ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఒలింపిక్ డే రన్ కేవలం క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు. క్రమశిక్షణతో కూడిన క్రీడాకారులే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని చెప్పుకొచ్చారు. మిలిటరీ సైనికులకు ఉన్నంత క్రమశిక్షణ క్రీడాకారులకు కూడా ఉండాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల్లో క్రీడలకు అపూర్వ ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని మంత్రి తెలిపారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ రెండు ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒలింపిక్ డే అందించే క్రీడా స్ఫూర్తిని మరింత విస్తృతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

ACB Raids | హైదరాబాద్లో మరోసారి ఏసీబీ మెరుపు దాడులు.. మల్లారెడ్డి నివాసంలో సోదాలు
జూన్ 23, 2026

Srinivas Goud | పాలమూరు ఎడారిగా మారుతోంది.. కాంగ్రెస్ కుట్రలను అడ్డుకుంటాం : శ్రీనివాస్ గౌడ్
జూన్ 23, 2026

Minister Vakiti Srihari | మత్తు వదలండి.. మైదానాలు చేరండి.. యువతకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●MLC Patnam Mahender Reddy | ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పట్నం
- ●ACB Raids | హైదరాబాద్లో మరోసారి ఏసీబీ మెరుపు దాడులు.. మల్లారెడ్డి నివాసంలో సోదాలు
- ●Trains | రైళ్లలో ఈ వస్తువులను తీసుకెళ్తే రూ.10వేల జరిమానా
- ●SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..
- ●HYD Metro | మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- ●Nivetha Pethuraj | డీ గ్లామర్ పాత్రలో నివేదా - టాలీవుడ్ హీరోతో రెండోసారి రొమాన్స్

MLC Patnam Mahender Reddy | ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పట్నం

ACB Raids | హైదరాబాద్లో మరోసారి ఏసీబీ మెరుపు దాడులు.. మల్లారెడ్డి నివాసంలో సోదాలు

Trains | రైళ్లలో ఈ వస్తువులను తీసుకెళ్తే రూ.10వేల జరిమానా

SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..



