HYD Metro | మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
HYD Metro | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఢిల్లీలో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ రెండు అంశాల్లో ఉన్న ఆటంకాలను తొలగించేందుకు వరుసగా రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- ఫలప్రదమైన చర్చలు
- ఫేజ్-1 వాల్యూయేషన్, ఫేజ్-2 విస్తరణకు కన్సల్టెంట్‌గా ఎస్‌బీఐక్యాప్స్
- కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ
- సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ
- ఢిల్లీ భేటీలో సీఎం, కేంద్రమత్రుల సంయుక్త భేటీలో నిర్ణయం
HYD Metro | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఢిల్లీలో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ రెండు అంశాల్లో ఉన్న ఆటంకాలను తొలగించేందుకు వరుసగా రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదట సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంగళవారం ఉదయం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో మరో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 వాల్యుయేషన్, ఫేజ్-1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్-2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణాల సమీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఒక కన్సల్టెంట్‌ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్‌గా ఎస్‌బీఐక్యాప్స్ (SBICAPS)ను ఎంపిక చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 వాల్యుయేషన్, ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియ, ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక అంశాలతో పాటు ఇతర సంబంధిత విషయాలపై ఎస్‌బీఐక్యాప్స్ సమగ్ర అధ్యయనం నిర్వహించనుంది. ఆ సంస్థ సమర్పించే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
కన్సల్టెంట్ అధ్యయనం సజావుగా, వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక సమన్వయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారిని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిని సమన్వయ అధికారులుగా నియమించనున్నారు. ఈ ఇద్దరు అధికారులు పరస్పర సమన్వయంతో అధ్యయన ప్రక్రియను పర్యవేక్షిస్తూ, నివేదిక త్వరితగతిన సిద్ధమయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Asus | గేమింగ్, కంటెంట్ క్రియేటర్లకు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ పనులకు ప్రత్యేకం..
- ●Sushruta Statue Edinburgh | ప్రపంచంలోనే అతి ప్రాచీన మెడికల్ కాలేజీలో మన 'సుశ్రుతుడి' విగ్రహం.. 2600 ఏళ్ల నాటి భారతీయ వైద్యానికి అరుదైన గౌరవం
- ●Tamannaah | ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా కన్ఫామ్
- ●Harish Rao | చెప్పేది ఇందిరమ్మ రాజ్యం.. చేసేది హిట్లర్ రాజ్యం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Udhayanidhi Stalin | భర్త కోసం వెతుకుతున్న భార్య కథ రాష్ట్రమంతా తెలుసు.. సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు
- ●Titabar Mariani Railway Incident | పట్టాలపైకి వచ్చిన ఏనుగుల మంద.. ఎమర్జెన్సీ బ్రేకులతో పెను ప్రమాదాన్ని తప్పించిన లోకో పైలట్లు!

Asus | గేమింగ్, కంటెంట్ క్రియేటర్లకు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ పనులకు ప్రత్యేకం..

Sushruta Statue Edinburgh | ప్రపంచంలోనే అతి ప్రాచీన మెడికల్ కాలేజీలో మన 'సుశ్రుతుడి' విగ్రహం.. 2600 ఏళ్ల నాటి భారతీయ వైద్యానికి అరుదైన గౌరవం

Tamannaah | ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా కన్ఫామ్

Harish Rao | చెప్పేది ఇందిరమ్మ రాజ్యం.. చేసేది హిట్లర్ రాజ్యం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్






