త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

South Central Railway | ఇక‌ పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..

South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నవంబర్ 1 నుంచి 30 వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచారం 5.0 నిర్వహించనున్నారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ, ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పెన్షనర్లు ఇంటి నుంచే వార్షిక జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. ఇందుకోసం రెండు మొబైల్ యాప్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది.

S

Business | Published On Oct 29, 2026, 3.17 pm IST

South Central Railway | ఇక‌ పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..
Advertisement

South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నవంబర్ 1 నుంచి 30 వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచారం 5.0 నిర్వహించనున్నారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ, ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పెన్షనర్లు ఇంటి నుంచే వార్షిక జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. ఇందుకోసం రెండు మొబైల్ యాప్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది.

పెన్షనర్లు ప్రతి సంవత్సరం తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించేందుకు పెన్షన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దక్షిణ మధ్య రైల్వే కీలక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచారం 5.0ను నవంబర్ 1 నుంచి 30 వరకు తన పరిధిలో అమలు చేయనుంది. ఈ విధానం ద్వారా పెన్షన్ చెల్లింపులు నిరంతరాయంగా కొనసాగేందుకు వీలవుతుంది. ముఖ్యంగా వృద్ధులు, నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొనే పెన్షనర్లకు ఈ సదుపాయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ హేమ సునీత ఆవిష్కరించినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎలా పొందాలి..?

పెన్షనర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఆధార్ ఫేస్ ఆర్‌డీ (ఎర్లీ యాక్సెస్) యాప్‌తోపాటు గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న జీవన్ ప్రమాణ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ లేదా ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అనంతరం ఆధార్ ప్రకారం పేరు, పెన్షన్ రకం, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) నంబర్, పెన్షన్ ఖాతా నంబర్, పెన్షన్ మంజూరు చేసిన అధికారం, చెల్లింపులు నిర్వహించే సంస్థ వివరాలను నమోదు చేయాలి. అవసరమైన సమాచారాన్ని అందించి, డిక్లరేషన్‌ను అంగీకరించిన తర్వాత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ రూపొందుతుంది.

ధ్రువీకరణ విజయవంతమైన తర్వాత పెన్షనర్ల మొబైల్‌కు జీవన్ ప్రమాణ్ ఐడీ (ప్రమాణ్ ఐడీ)తోపాటు ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్‌తో కూడిన ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఆ లింక్ ద్వారా సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ డిజిటల్ సదుపాయంతో ప్రతి సంవత్సరం పెన్షన్ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లి జీవిత ధ్రువీకరణ చేయించుకోవాల్సిన ఇబ్బందులు తొలగనున్నాయి. పెన్షనర్లు తమ వార్షిక ధ్రువీకరణ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునేందుకు ఈ ప్రచారం ఉపయోగపడనుంది.

Advertisement
Advertisement