South Central Railway | అర్నాబ్ ఎఫెక్ట్.. పలు రైళ్లు దారి మళ్లింపు..?
South Central Railway | అర్నాబ్ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే( South Central Railway ) అప్రమత్తమైంది. అక్టోబర్ 28న తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్( Red Alert ) జారీ చేసింది.
South Central Railway | త్రినేత్ర న్యూస్ : అర్నాబ్ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే( South Central Railway ) అప్రమత్తమైంది. అక్టోబర్ 28న తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్( Red Alert ) జారీ చేసింది. ఇక తుపాను యానాం వద్ద అతి తీవ్ర తుపానుగా మారి తీరం దాటే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 28, 29 తేదీల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తుపాను తీవ్రత, భారీ వర్షాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని రైళ్లను మళ్లించడం, రీ షెడ్యూల్ చేయడం జరుగుతుందని తెలిపింది. భారీ వర్షాలపై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ సమీక్ష చేశారు. రైల్వే బ్రిడ్జిల వద్ద పరిస్థితిపై ఆరా తీశారు. ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాజీపేట, డోర్నలక్ స్టేషన్ల వద్ద మెడికల్ బృందాలను ఉంచాలన్నారు. తుపాను నేపథ్యంలో ప్రయాణికులు కూడా రైళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో చూసుకోవాలన్నారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా అప్రమత్తం చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
- ●Bill Gates AI Warning | ముందుంది మొసళ్ల పండుగ.. రాబోయే 20 ఏళ్లు గండమే..!
- ●Telangana | డిసెంబర్ 9న 1.90 లక్షల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
- ●Maharashtra | రైతులకు “మహా” సర్కారు ఊరట
- ●Jeevan Reddy | రేవంత్! నాన్చకు ఇగ.. కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపొయ్
- ●PhonePe | ఫోన్‌పేలో రూ.250తో పెన్ష ఖాతా.. కేవైసీ అవసరం లేదు..
- ●Shah Rukh Khan | హంతకుడా...ప్రేమికుడా..? - కింగ్ పోస్ట్‌పోన్ రూమర్లపై స్టైలిష్ పోస్టర్‌తో షారుఖ్ క్లారిటీ

Bill Gates AI Warning | ముందుంది మొసళ్ల పండుగ.. రాబోయే 20 ఏళ్లు గండమే..!

Telangana | డిసెంబర్ 9న 1.90 లక్షల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

Maharashtra | రైతులకు “మహా” సర్కారు ఊరట

Jeevan Reddy | రేవంత్! నాన్చకు ఇగ.. కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపొయ్





