PAN Card | ఇకపై పాన్ కార్డును పొందడం కష్టమే.. మార్చి 31 తరువాత నుంచి కొత్త రూల్స్..
PAN Card | కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు దరఖాస్తు నిబంధనల్లో కీలక మార్పులను ప్రకటించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం కేవలం ఆధార్ కార్డు ఆధారంగా పాన్ కార్డు దరఖాస్తులను ఇకపై అంగీకరించరు.
PAN Card | కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు దరఖాస్తు నిబంధనల్లో కీలక మార్పులను ప్రకటించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం కేవలం ఆధార్ కార్డు ఆధారంగా పాన్ కార్డు దరఖాస్తులను ఇకపై అంగీకరించరు. ఈ నేపథ్యంలో పాన్ కార్డు కోసం ఇంకా దరఖాస్తు చేయని పౌరులు మార్చి 31లోపు ఆధార్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, దరఖాస్తు ప్రక్రియపై కఠినమైన పరిశీలన ఉండటంతో పాన్ కార్డు పొందడం కొంత కష్టమయ్యే అవకాశం ఉంటుంది.
https://twitter.com/CSCegov_/status/2033947561992851569
ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) ఎక్స్ వేదికగా పాన్ కార్డులకు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. మార్చి 31 వరకు పౌరులు కేవలం ఆధార్ కార్డు ఆధారంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్ అనేది భారతీయులకు యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. పాన్ (Permanent Account Number) కార్డు బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలలో అత్యంత కీలక పత్రంగా ఉపయోగపడుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత పాన్ కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫామ్‌లు అవసరం అవుతాయి. ఆధార్‌తో పాటు జనన తేదీకి సంబంధించిన అదనపు ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఏయే పత్రాలను అనుమతిస్తారు..
సీఎస్‌సీ ప్రకారం జనన ధ్రువీకరణ కోసం కనీసం ఆరు రకాల పత్రాలను అంగీకరిస్తారు. వీటిలో జనన సర్టిఫికేట్, ఓటర్ ఐడీ కార్డు, మ్యాట్రిక్యులేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, అఫిడవిట్, పాస్‌పోర్ట్ లేదా ఇతర ప్రభుత్వ పత్రాలను స్వీకరిస్తారు. ఇకపై పాన్ కార్డులోని పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరుకు అనుగుణంగా మాత్రమే నమోదు చేయబడుతుంది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత పాత ఫామ్‌లు చెల్లుబాటు కావని సీఎస్‌సీ స్పష్టం చేసింది. కొత్త పాన్ ఫామ్‌లు త్వరలో విడుదల చేయబడతాయని తెలిపింది. ఈ మార్పుల నేపథ్యంలో పౌరులు మార్చి 31లోపు ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సూచించింది. ఏవైనా సందేహాలు ఉంటే abhirendra.pal@csc.gov.in లో సంప్రదించవచ్చని తెలిపింది. కొత్త పాన్ కార్డు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలనుకునే వారు Protean (మునుపటి NSDL eGov), UTITSL పోర్టల్ లేదా ఆదాయపన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా Instant e-PAN సేవను ఉపయోగించుకోవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






