త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple Pay | ఫోన్‌పే, గూగుల్ పే ల‌కు పోటీగా త్వ‌ర‌లోనే యాపిల్ పే సేవ‌లు..!

Apple Pay | భారత డిజిటల్ పేమెంట్స్ మార్కెట్‌లోకి త్వరలోనే యాపిల్ మరో కొత్త ప్లేయర్‌గా అడుగుపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగంలో ఉన్న Apple Pay సేవలను ఈ ఏడాది భారత్‌లో ప్రారంభించేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

S

Business | Published On Jan 23, 2026, 7.30 am IST

Apple Pay | ఫోన్‌పే, గూగుల్ పే ల‌కు పోటీగా త్వ‌ర‌లోనే యాపిల్ పే సేవ‌లు..!
Advertisement

Apple Pay | భారత డిజిటల్ పేమెంట్స్ మార్కెట్‌లోకి త్వరలోనే యాపిల్ మరో కొత్త ప్లేయర్‌గా అడుగుపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగంలో ఉన్న Apple Pay సేవలను ఈ ఏడాది భారత్‌లో ప్రారంభించేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి యాపిల్ ఇప్పటికే వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్ సంస్థలతో చర్చలు జరుపుతుండటంతో పాటు, భారత నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందే ప్రక్రియలో ఉంది. యాపిల్ పేమెంట్ గేట్‌వే వినియోగానికి సంబంధించి కార్డ్ జారీ సంస్థలతో ఫీజు నిర్మాణాలపై కూడా యాపిల్ చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం Apple Pay ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో సేవలు అందిస్తోంది. భారత్‌లో ఈ సేవలను దశలవారీగా ప్రారంభించాలన్న ప్రణాళికలో యాపిల్ ఉన్నట్లు తెలుస్తోంది.

కాంటాక్ట్ లెస్ పేమెంట్స్‌, యూపీఐ వ్య‌వస్థ‌..

మొదటి దశలో కార్డ్ ఆధారిత కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌పై దృష్టి సారించనుండగా, తరువాతి దశలో యూపీఐ (UPI) వ్యవస్థతో అనుసంధానం చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి ప్రత్యేకమైన నియంత్రణ అనుమతులు అవసరం అవుతాయి. ప్రస్తుతం Apple Pay థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా నమోదు చేసుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని సమాచారం. ఎందుకంటే, యూపీఐ వ్యవస్థకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, సాంకేతిక నిర్మాణం కార్డ్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌కు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. Apple Pay సేవలు యాపిల్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన Apple Payments Services ద్వారా నిర్వహించబడతాయి.

ఫోన్‌పే, గూగుల్‌పే ల‌కు గ‌ట్టి పోటీ..

భారత్‌లో ప్రారంభమైన తర్వాత, వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను Apple Walletలో భద్రపరుచుకుని, NFC సాంకేతికత ద్వారా పాయింట్ ఆఫ్ సేల్ (PoS) మెషీన్ల వద్ద తమ యాపిల్ డివైజ్‌ను ట్యాప్ చేసి చెల్లింపులు చేయగలుగుతారు. ప్రస్తుతం భారతీయ బ్యాంకు కార్డులు Apple Wallet‌కు అనుకూలంగా లేవు. భారత్‌లో యాపిల్ ఉనికి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలనే వ్యూహంలో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సేవల ప్రారంభంపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వినియోగదారులు కొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ భార‌త్ లో యాపిల్ పే ద్వారా యూపీఐ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తే మాత్రం ఫోన్‌పే, గూగుల్ పే వంటి సంస్థ‌ల‌కు గట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే భార‌త్‌లోనూ యాపిల్ ఐఫోన్ల వినియోగ‌దారుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. క‌నుక వారంద‌రినీ యాపిల్ త‌మ సొంత పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ వైపు తిప్పుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు. మ‌రి భార‌త్‌లో యాపిల్ పేమెంట్ సేవ‌ల‌ను ఎప్పుడు ప్రారంభిస్తుందో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement