NPCI | దీపావళి తర్వాతే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు
NPCI | ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలపై యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలును దీపావళి తర్వాతకు వాయిదా వేస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
NPCI | ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలపై యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలును దీపావళి తర్వాతకు వాయిదా వేస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తి నుంచి వ్యాపారికి (పీ2ఎం) జరిగే ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను దీపావళి తర్వాత అమలు చేయనున్నారు. అయితే, ఈ విధానం అమల్లోకి వచ్చే కచ్చితమైన తేదీని తర్వాత ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది.
కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) దేశంలో రిటైల్ చెల్లింపులు, సెటిల్‌మెంట్ వ్యవస్థల నిర్వహణకు బాధ్యత వహించే ప్రధాన సంస్థ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చొరవతో ఈ సంస్థ ఏర్పాటైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చెల్లింపుల కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడం, డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించడం ఎన్‌పీసీఐ ప్రధాన లక్ష్యాలు. లోతైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెల్లింపుల వ్యవస్థలను ఆధునికీకరించడంతో పాటు, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తోంది. సాంకేతిక రంగంలో పురోగతిని సాధించేందుకు భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తోంది. భారత బ్యాంకింగ్ వ్యవస్థకు భౌతిక, ఎలక్ట్రానిక్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
బలమైన వ్యవస్థ అభివృద్ధికి కృషి..
దేశంలో బలమైన, సమర్థవంతమైన, అందరికీ అందుబాటులో ఉండే చెల్లింపులు, సెటిల్‌మెంట్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై ఎన్‌పీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), రూపే, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్‌ఏసీహెచ్), ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ), ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్), ఈ-రూపీ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు దేశంలో చెల్లింపుల వ్యవస్థల సామర్థ్యాన్ని, అందుబాటును మెరుగుపరచడంతో పాటు ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయడంలో దోహదపడుతున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ranabaali Censor Review | రణబాలి సెన్సార్ రివ్యూ - జీరో కట్స్ - రఫ్పాడించిన విజయ్ - యాక్షన్ ఫీస్ట్
- ●Telangana Municipalities | తెలంగాణ మున్సిపాలిటీలకు భారీ ఊరట..!
- ●Harish Rao | పీఎంయూ టెండర్లను తక్షణమే రద్దు చేయాలి
- ●Rukmini Vasanth | వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు - అయినా ఛాన్స్‌లు - హీరో నాని ప్రేమకథలో రుక్మిణి వసంత్
- ●Manchireddy Kishan Reddy | రేవంత్! రైతులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తవ్?
- ●ICC Player of the Month September 2026 | ఐసీసీ అవార్డుల్లో భారత స్టార్ల క్లీన్‌స్వీప్: రికార్డు స్థాయిలో 5వ సారి శుభ్‌మన్‌కు కిరీటం.. అదరగొట్టిన షఫాలీ వర్మ

Ranabaali Censor Review | రణబాలి సెన్సార్ రివ్యూ - జీరో కట్స్ - రఫ్పాడించిన విజయ్ - యాక్షన్ ఫీస్ట్

Telangana Municipalities | తెలంగాణ మున్సిపాలిటీలకు భారీ ఊరట..!

Harish Rao | పీఎంయూ టెండర్లను తక్షణమే రద్దు చేయాలి

Rukmini Vasanth | వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు - అయినా ఛాన్స్‌లు - హీరో నాని ప్రేమకథలో రుక్మిణి వసంత్






