Acerpure Nitro QLED TV | ఏసర్ నుంచి భారీ క్యూఎల్‌ఈడీ టీవీలు.. బడ్జెట్ ధరలకే లభ్యం..
Acerpure Nitro QLED TV | ఏసర్ గ్రూప్‌కు చెందిన ఏసర్‌ప్యూర్ ఇండియా భారత మార్కెట్లో నైట్రో క్యూఎల్‌ఈడీ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 75, 85, 100 ఇంచుల స్క్రీన్ సైజుల్లో మూడు మోడళ్లు ఉన్నాయి. వీటిలో క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీ, 4కె రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Acerpure Nitro QLED TV | ఏసర్ గ్రూప్‌కు చెందిన ఏసర్‌ప్యూర్ ఇండియా భారత మార్కెట్లో నైట్రో క్యూఎల్‌ఈడీ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 75, 85, 100 ఇంచుల స్క్రీన్ సైజుల్లో మూడు మోడళ్లు ఉన్నాయి. వీటిలో క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీ, 4కె రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీలు ఏఎల్‌ఎల్‌ఎం అంటే ఆటో లో లేటెన్సీ మోడ్, ఎంఈఎంసీ అంటే మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కాంపెన్సేషన్, వీఆర్‌ఆర్ అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ వంటి గేమింగ్ ఫీచర్లను కూడా అందిస్తున్నాయి. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తోపాటు గూగుల్ టీవీ 5.0 రెఫ్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.
ధరలు ఎంతంటే..
ఏసర్‌ప్యూర్ నైట్రో క్యూఎల్‌ఈడీ టీవీల్లో 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, వైఫై, బ్లూటూత్ సదుపాయాలు ఉన్నాయి. రిమోట్ ద్వారా వాయిస్ సెర్చ్ కూడా చేయవచ్చు. 75, 85 ఇంచుల మోడళ్లలో 40 వాట్ల బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. 100 ఇంచుల మోడల్‌లో 65 వాట్ల బాక్స్ స్పీకర్‌ను అందించారు. మూడు మోడళ్లలోనూ ఇన్‌బిల్ట్ కరావోకే ఫీచర్ ఉంది. వారంటీ ఒక సంవత్సరం పాటు ఇస్తున్నారు. ఏసర్‌ప్యూర్ నైట్రో క్యూఎల్‌ఈడీ టీవీలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. 75 ఇంచుల మోడల్ ధర రూ.59,999గా ఉంది. 85 ఇంచుల మోడల్ ధరను రూ.99,999గా నిర్ణయించారు. ఇక 100 ఇంచుల భారీ మోడల్ ధర రూ.1,89,999గా ఉంది.
తాజావార్తలు
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?
- ●KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం
- ●CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు
- ●Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!

Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్

KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం






