Hisense UR8S | హైసెన్స్ నుంచి ఆర్‌జీబీ మినీ ఎల్ఈడీ టీవీలు.. తక్కువ ధరలకే లాంచ్..
Hisense UR8S | చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ హైసెన్స్ భారత మార్కెట్లో యూఆర్8ఎస్ ఆర్జీబీ మినీఎల్ఈడీ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఆర్జీబీ మినీఎల్ఈడీ సాంకేతికతను అందించారు. హై-వ్యూ ఏఐ ఇంజిన్ ఆర్జీబీ ద్వారా రంగులు, ప్రకాశం, చిత్ర నాణ్యతను నిజ సమయంలో ఆప్టిమైజ్ చేస్తుంది. అలాగే ఏఐ ఆర్జీబీ లైట్ సెన్సార్ పరిసరాల్లోని వెలుతురు ఆధారంగా చిత్ర సెట్టింగులను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.
Technology | Published On Aug 11, 2026, 5.45 pm IST
Hisense UR8S | చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ హైసెన్స్ భారత మార్కెట్లో యూఆర్8ఎస్ ఆర్జీబీ మినీఎల్ఈడీ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఆర్జీబీ మినీఎల్ఈడీ సాంకేతికతను అందించారు. హై-వ్యూ ఏఐ ఇంజిన్ ఆర్జీబీ ద్వారా రంగులు, ప్రకాశం, చిత్ర నాణ్యతను నిజ సమయంలో ఆప్టిమైజ్ చేస్తుంది. అలాగే ఏఐ ఆర్జీబీ లైట్ సెన్సార్ పరిసరాల్లోని వెలుతురు ఆధారంగా చిత్ర సెట్టింగులను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. యూఆర్8ఎస్ టీవీలో 4కె రిజల్యూషన్, గరిష్ఠంగా 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 180 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. దీని వల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. యాంటీ-రిఫ్లెక్షన్, గ్లేర్-ఫ్రీ టెక్నాలజీలను కూడా అందించారు. డాల్బీ విజన్, ఐమ్యాక్స్ ఎన్‌హాన్స్‌డ్, ఫిల్మ్‌మేకర్ మోడ్‌లకు టీవీ సపోర్ట్ ఇస్తుంది.
ఫీచర్లు ఇవే..
ఆడియో కోసం 2.1.2-ఛానల్ మల్టీ-ఛానల్ సరౌండ్ సౌండ్ వ్యవస్థను అందించారు. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. స్మార్ట్ టీవీ వీడా ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా, స్థానికంగా అందుబాటులో ఉన్న వివిధ స్ట్రీమింగ్ సేవలను యాక్సెస్ చేయవచ్చు. హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్, వీడా వాయిస్ సదుపాయాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ హోమ్ ఫీచర్లలో అలెక్సా బిల్ట్-ఇన్, గూగుల్ హోమ్ కనెక్టివిటీ, యాపిల్ ఎయిర్‌ప్లే, యాపిల్ హోమ్ ఇంటిగ్రేషన్ ఉన్నాయి. డిజైన్ పరంగా అల్ట్రా-స్లిమ్ బాడీ, బెజెల్-లెస్ డిస్‌ప్లేను అందించారు. యూఆర్8ఎస్ సిరీస్‌లో ఆర్జీబీ మినీఎల్ఈడీ, 4కె అల్ట్రా హెచ్‌డీ 3840 *2160 పిక్సల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. 55, 65, 75 ఇంచుల స్క్రీన్ పరిమాణాల్లో ఈ టీవీలు రిలీజ్ అయ్యాయి. ప్రాసెసర్‌గా హై-వ్యూ ఏఐ ఇంజిన్ ఆర్జీబీని ఉపయోగించారు. డిస్‌ప్లేలో యాంటీ-రిఫ్లెక్షన్, గ్లేర్-ఫ్రీ, వైడ్ కలర్ గామట్, 8-బిట్ ప్లస్ ఎఫ్‌ఆర్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్ కోసం ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం ప్రొ, వీఆర్‌ఆర్, ఏఎల్‌ఎల్‌ఎం, హెచ్‌డీఆర్10 ప్లస్ గేమింగ్, డాల్బీ విజన్ గేమింగ్, గేమ్ బార్ వంటి ఫీచర్లను అందించారు.
ప్రత్యేక విజన్, సౌండ్ సిస్టమ్‌లు..
హెచ్‌డీఆర్ విభాగంలో డాల్బీ విజన్ ఐక్యూ, హెచ్‌డీఆర్10 ప్లస్, హెచ్‌డీఆర్10 ప్లస్ అడాప్టివ్, హెచ్‌ఎల్‌జీ, ఐమ్యాక్స్ ఎన్‌హాన్స్‌డ్ సపోర్ట్ ఉన్నాయి. కాంట్రాస్ట్ రేషియో 55 ఇంచుల మోడల్‌లో 5000:1, 65 ఇంచుల మోడల్‌లో 6000:1గా ఉంది. ఆడియో వ్యవస్థలో 2.1.2-ఛానల్ మల్టీ-ఛానల్ సరౌండ్ సౌండ్, 89 వాట్ల స్పీకర్లు, డాల్బీ అట్మాస్, బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్ ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్లలో ఏఐ పిక్చర్, ఏఐ స్పోర్ట్స్ మోడ్, ఏఐ ఆర్జీబీ లైట్ సెన్సార్, ఎయిర్‌ప్లే 2, స్క్రీన్ షేరింగ్, కంటెంట్ షేరింగ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం వైఫై 6ఈ, బ్లూటూత్ 5.4, ఈథర్‌నెట్, ఆప్టికల్ ఆడియో, సీఐ ప్లస్ తో పాటు రెండు ఆర్ఎఫ్ ట్యూనర్లు ఉన్నాయి.
ధర ఎంతంటే..
హైసెన్స్ యూఆర్8ఎస్ ఆర్జీబీ మినీఎల్ఈడీ టీవీ సిరీస్ 55, 65, 75 ఇంచుల డిస్‌ప్లే సైజ్ వేరియంట్లలో లభిస్తుండగా వీటి ప్రారంభ ధర రూ.1,19,990గా ఉంది. సత్య, నందిలత్, మైజీ, గ్రేట్ ఈస్టర్న్, పాత్ర ఎలక్ట్రానిక్స్, ఖోస్లా వంటి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్లతోపాటు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్, రెండేళ్ల సమగ్ర వారంటీ, ఒక ఉచిత ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, ఫిక్స్‌డ్ ఈఎంఐ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vishnu Priya | హీరోయిన్గా విష్ణుప్రియ - ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా...
- ●Kadiyam Kavya | కాకతీయ జూ అభివృద్ధికి కాంపా నిధులు ఇవ్వండి.. ఎంపీ కావ్య రిక్వెస్ట్
- ●CM Revanth Reddy | ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
- ●FSSAI | పిల్లల ఆహారంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త నిబంధనలు.. షుగర్, ఉప్పు, కొవ్వుకు పరిమితులు..
- ●Himachal Pradesh | హిమాచల్‌లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి
- ●KBR Park | వాహనదారులారా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే

Vishnu Priya | హీరోయిన్గా విష్ణుప్రియ - ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా...

Kadiyam Kavya | కాకతీయ జూ అభివృద్ధికి కాంపా నిధులు ఇవ్వండి.. ఎంపీ కావ్య రిక్వెస్ట్

CM Revanth Reddy | ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

FSSAI | పిల్లల ఆహారంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త నిబంధనలు.. షుగర్, ఉప్పు, కొవ్వుకు పరిమితులు..




