Mutual Fund SIP | యుద్ధంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన.. SIPలను ఉంచాలా, తీసేయాలా..?
Mutual Fund SIP | సంపద సృష్టికి అత్యంత సులభమైన మార్గంగా ప్రచారం పొందిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (SIPs) ప్రస్తుతం పెట్టుబడిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దాదాపు 18 నెలలుగా కొనసాగుతున్న బలహీన మార్కెట్ ప్రదర్శన, అలాగే ఇరాన్ ఘర్షణతో ప్రారంభమైన భారీ ఈక్విటీ అమ్మకాల ప్రభావంతో తక్కువ కాలానికి సంబంధించిన రాబడులు నష్టాల్లోకి జారుకున్నాయి.
Mutual Fund SIP | సంపద సృష్టికి అత్యంత సులభమైన మార్గంగా ప్రచారం పొందిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (SIPs) ప్రస్తుతం పెట్టుబడిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దాదాపు 18 నెలలుగా కొనసాగుతున్న బలహీన మార్కెట్ ప్రదర్శన, అలాగే ఇరాన్ ఘర్షణతో ప్రారంభమైన భారీ ఈక్విటీ అమ్మకాల ప్రభావంతో తక్కువ కాలానికి సంబంధించిన రాబడులు నష్టాల్లోకి జారుకున్నాయి. 2020-21లో కోవిడ్ కారణంగా మార్కెట్లు దెబ్బతిన్న తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలా జరుగుతోంది. నిఫ్టీలో సుమారు 13 శాతం పతనం, అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో చాలా వరకు కరెక్షన్స్ వచ్చాయి. దీంతో మ్యూచువల్ ఫండ్ రాబడులు తగ్గిపోయాయి. దాని ఫలితంగా చాలా ఈక్విటీ కేటగిరీల్లో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల SIP రాబడులు ప్రస్తుతం నెగటివ్‌గా మారాయి. మూడు సంవత్సరాల రాబడులు కూడా 5 శాతం దాటడంలో కష్టపడుతున్నాయి.
స్వల్పకాలంలో అన్నీ నెగెటివ్‌లోనే..
లార్జ్ అండ్ మిడ్ క్యాప్ విభాగంలో SIP రాబడులు ఏడాది కాలానికి -12.3 శాతం నెగెటివ్‌లో ఉండగా, 2 ఏళ్ల కాలవ్యవధికి -4.1 నెగెటివ్‌లో ఉన్నాయి. 3 ఏళ్ల కాలవ్యవధికి మాత్రం 5.2 శాతం లాభంతో ఉన్నాయి. ఇక మిడ్ క్యాప్ విభాగంలో SIP రాబడులు ఇవే కాల వ్యవధులకు వరుసగా -10.4, -3.3, 7.3 శాతం రాబడులతో ఉన్నాయి. స్మాల్ క్యాప్‌లో ఏడాది కాలవ్యవధికి SIP లు -15.4 నెగెటివ్ లాభాన్ని చూపిస్తుండగా, 2 ఏళ్ల కాలవ్యవధికి -7.8 శాతం నష్టాల్లో ఉన్నాయి. 3 ఏళ్ల కాలవ్యవధిలో మాత్రం 2.3 శాతం లాభాల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
దీర్ఘకాలంలో పాజిటివ్‌గానే..
తక్కువ కాలంలో నష్టాలు విస్తృతంగా కనిపిస్తున్నప్పటికీ, 10 సంవత్సరాల SIP రాబడులు అన్ని కేటగిరీల్లో పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. లార్జ్, మిడ్ క్యాప్ కేటగిరీల్లో 10 సంవత్సరాల రాబడులు 15 శాతం వరకు ఉన్నాయి. స్మాల్ క్యాప్‌లో కూడా 10 సంవత్సరాల్లో SIP రాబడులు 17 శాతం దాటాయి. అయితే యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు అందరు మదుపర్ల మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. SIP లను కొనసాగించాలా, తీసేయాలా.. అని ఏరోజుకారోజు కొత్త కొత్త సందేహాలు వస్తున్నాయి. అయితే ఇందుకు ఆర్థిక నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.

SIPలు దీర్ఘకాలం పెట్టుబడుల కోసమే..
ఈ పరిస్థితిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమలై మాట్లాడుతూ ఈక్విటీ పెట్టుబడులలో క్రమశిక్షణ అంటే ప్రతి సమయంలో పాజిటివ్ రాబడులు రావడం కాదని, SIPలు మధ్యకాలం నుంచి దీర్ఘకాల పెట్టుబడుల కోసమని అన్నారు. కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఉద్దేశించినవని, కొన్నిసార్లు తక్కువ కాలంలో SIPలు నెగటివ్ రాబడులు ఇస్తాయని, కానీ పెట్టుబడిదారులు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడులు సాధారణంగా పాజిటివ్ రాబడులుగా మారుతాయని అన్నారు. పడిపోవడం సహజం, కానీ క్రమశిక్షణ అంటే పెట్టుబడిని కొనసాగించడం, మధ్యలో బయటకు రాకపోవడం అని చెప్పారు.
ర్యాలీ తరువాత కరెక్షన్ సహజమే..
యుద్ధం భయంతో SIPలను తీసేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పుడు వాటిని తీసేయడం సరికాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. SIPలను తీసేస్తేనే సురక్షితమని చాలా మంది భావిస్తుంటారు. అయితే SIP లకు ఉండే కాంపౌండింగ్ శక్తి మళ్లీ జమ అవడం కష్టమని, ఇప్పటి వరకు చేసిన పొదుపు పూర్తిగా పోతుందని అంటున్నారు. కొంత కాలం వేచి చూశాక నిర్ణయం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇదే విషయంపై గ్రేప్స్ వరల్డ్‌వైడ్ కో-ఫౌండర్, గ్లోబల్ సీఈవో శ్రద్ధ అగర్వాల్ స్పందిస్తూ తక్కువ కాలంలో SIP రాబడులపై ఒత్తిడి సహజమే అని అన్నారు. ముఖ్యంగా బలమైన ర్యాలీ తర్వాత మార్కెట్లు కరెక్షన్ అవుతాయని, గత సంవత్సరం నుంచి ప్రపంచ స్థాయి అంశాలు, విలువల సవరణలు ఈక్విటీలను ప్రభావితం చేశాయని, అందువల్ల SIPలు తక్కువకాలంలో నెగెటివ్‌గా మారడం సహజమేనని అన్నారు. కానీ SIPలను తక్కువకాలంలో అంచనా వేయడానికి రూపొందించలేదని, వాటి అసలు బలం మార్కెట్ ఎత్తుపల్లాలను తట్టుకుని కొనసాగడంలో ఉంటుందని అన్నారు. మార్కెట్లు పడిపోయినప్పుడు పెట్టుబడిదారులు తక్కువ స్థాయిలలో కొనుగోలు చేస్తున్నారని, ఇది భవిష్యత్తులో వారికి లాభదాయకంగా మారుతుందని ఆమె అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



