Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌ను రిడీమ్ చేసినా, పూర్తిగా విక్రయించినా ట్యాక్స్ చెల్లించాలా..? ఎంత మొత్తం..?
Mutual Funds | దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టి సంపదను సృష్టించాలంటే అందుకు ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిని చాలా మంది ప్రజలు తమ సంపద సృష్టికి అద్భుత అవకాశాలుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఫండ్స్ ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందాయి.
Mutual Funds | దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టి సంపదను సృష్టించాలంటే అందుకు ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిని చాలా మంది ప్రజలు తమ సంపద సృష్టికి అద్భుత అవకాశాలుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఫండ్స్ ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే ఇన్వెస్టర్లు తమ యూనిట్లను రీడీమ్ చేసినప్పుడు లేదా విక్రయించినప్పుడు లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ లెక్కింపు విధానంలో అత్యంత ముఖ్యమైన నియమం ఫీఫో (FIFO) (ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్)ను పాటిస్తారు.
ఫీఫో అంటే ఏమిటి?
ఫీఫో విధానం ప్రకారం ముందుగా కొనుగోలు చేసిన యూనిట్లు ముందుగా విక్రయించినట్లుగా పరిగణిస్తారు. ఇదే విధానాన్ని ఆదాయపు పన్ను విభాగం క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ఉపయోగిస్తుంది. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఒకే మ్యూచువల్ ఫండ్‌లో పలు తేదీల్లో, పలు ధరల వద్ద యూనిట్లు కొనుగోలు చేసినట్లయితే (ఉదాహరణకు సిప్ ద్వారా), తర్వాత వాటిలో కొంత భాగాన్ని మాత్రమే విక్రయించినప్పుడు, మొదట కొనుగోలు చేసిన యూనిట్లే ముందుగా విక్రయించినట్లుగా పరిగణిస్తారు. ప్రతి కొనుగోలు తేదీకి వేర్వేరు హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. అదే ట్యాక్స్ రేటును నిర్ణయిస్తుంది.
షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్..
ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లో 12 నెలలలోపు యూనిట్లు విక్రయిస్తే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఎస్‌టీసీజీ)గా పరిగణిస్తారు. 12 నెలల తర్వాత విక్రయిస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఎల్‌టీసీజీ) కిందకు వస్తుంది. ఎస్‌టీసీజీపై 20 శాతం పన్ను విధిస్తారు. ఇక ఎల్‌టీసీజీ విషయంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల వరకు లాభాలు పన్ను నుంచి మినహాయింపు పొందుతాయి. దాని మించి లాభాలపై 12.5 శాతం పన్ను విధిస్తారు. అందువల్ల ఫీఫో విధానం ద్వారా ఏ యూనిట్లు ఎల్‌టీసీజీకి అర్హత పొందుతున్నాయో, ఏవి ఎస్‌టీసీజీ కిందకి వస్తాయో నిర్ణయిస్తారు.
సిప్ ఇన్వెస్టర్లకు ఫీఫో ప్రాముఖ్యత..
Systematic Investment Plan (సిప్) ద్వారా ప్రతి నెలా పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఈ నియమం మరింత కీలకం. ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్ ఒక కొత్త కొనుగోలు తేదీ, కొత్త ఎన్ఏవీతో వస్తుంది. రిడంప్షన్ సమయంలో ఫీఫో విధానం వల్ల పాత యూనిట్లు ముందుగా విక్రయించినట్లుగా పరిగణిస్తారు. ఇది చాలాసార్లు ఎల్‌టీసీజీ కిందకి రావడం వల్ల ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఇస్తుంది. దీంతో ట్యాక్స్ ప్లానింగ్ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతుంది. ముఖ్యంగా పూర్తిగా డబ్బు తీసుకోకుండా కొంతమేర మాత్రమే రీడీమ్ చేసే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దేశంలో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లెక్కించడంలో ఫీఫో ఒక ప్రామాణిక నియమం. ఇది ముందుగా కొనుగోలు చేసిన యూనిట్లను ముందుగా విక్రయించినట్లుగా పరిగణించి, హోల్డింగ్ పీరియడ్, ట్యాక్స్‌ను నిర్ణయిస్తుంది.
మ్యుచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా సిప్ ద్వారా పెట్టుబడి పెట్టేవారు, ఫీఫో విధానాన్ని అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. ఇది ట్యాక్స్ తగ్గించుకోవడంలోనే కాకుండా, రిడంప్షన్ ప్రణాళికను మెరుగుపరచడంలో కూడా కీలకంగా సహాయపడుతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Income Tax Department | మీ సేవింగ్స్ అకౌంట్‌పై ‘ఐటీ’ కన్ను.. ఈ 10 లావాదేవీలు చేస్తే నోటీసులు గ్యారెంటీ..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



