Nvidia | ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.. జెన్సన్ పునరాగమనంపై ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు..
Nvidia | ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తిరిగి కంపెనీ అధ్యక్షుడు, సీఈఓగా బాధ్యతలు చేపట్టడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ స్పందించారు. అమెరికా కృత్రిమ మేధ రంగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలనే స్పష్టమైన రాజకీయ, ఆర్థిక వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాజకీయ శక్తి, వ్యాపార ప్రయోజనాలు కార్పొరేట్ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ పరిణామం వెల్లడిస్తోందని పేర్కొన్నారు.
Nvidia | ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తిరిగి కంపెనీ అధ్యక్షుడు, సీఈఓగా బాధ్యతలు చేపట్టడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ స్పందించారు. అమెరికా కృత్రిమ మేధ రంగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలనే స్పష్టమైన రాజకీయ, ఆర్థిక వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాజకీయ శక్తి, వ్యాపార ప్రయోజనాలు కార్పొరేట్ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ పరిణామం వెల్లడిస్తోందని పేర్కొన్నారు.
ఉదయ్ కోటక్ ఏమన్నారంటే..?
ఎన్విడియా మార్కెట్ విలువ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆ కంపెనీ ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ఉదయ్ కోటక్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఒక లక్ష కోట్ల డాలర్ల పెరుగుదల, అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర పునరుద్ధరణ చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధ పోటీలో అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాలనే స్పష్టమైన రాజకీయ, ఆర్థిక లక్ష్యం ఈ పరిణామాల వెనుక ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ శక్తి సమీకరణాలు, ఆర్థిక ప్రయోజనాలు కీలకంగా మారినప్పుడు నిబంధనలు కూడా అనువుగా మారుతాయనే సందేశాన్ని ఈ నిర్ణయం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. ఏనుగులు నాట్యం చేస్తున్నప్పుడు వాటికి దారి ఇచ్చేందుకు అందరూ కదలాల్సిందే.. అంటూ ఉదయ్ కోటక్ చేసిన వ్యాఖ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అనూహ్యంగా మారిన పరిణామాలు..
కాగా నవంబర్ 11న తన నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌ను తిరిగి అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), బోర్డు డైరెక్టర్‌గా నియమిస్తూ నవంబర్ 23న కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన మళ్లీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఆయనకు కార్యాలయంలో ఘన స్వాగతం పలికారు. అనేక మంది ఎన్‌విడియా ఉద్యోగులతోపాటు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాలు కూడా జెన్సన్‌కు మద్దతుగా నిలిచారు. జెన్సన్‌ను తిరిగి సీఈఓగా నియమించడంలో అమెరికా వైట్ హౌస్ కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ధ్రువీకరించారు. ఆయన చొరవతోనే జెన్సన్ మళ్లీ వచ్చారని స్పష్టమైంది. అయితే డిసెంబర్ మొదటి వారంలో జెన్సన్ కచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో ఆ తేదీల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
సంబంధిత వార్తలు

Jensen Huang | ఎన్విడియా సీఈఓగా జెన్సన్ రాక, 31 శాతం ఎగసిన షేర్లు.. భారీగా పెరిగిన వ్యక్తిగత సంపద..
నవంబర్ 24, 2026

Jensen Huang | జెన్సన్ హువాంగ్ మళ్లీ సీఈఓ అవడం వెనుక.. వైట్ హౌస్ ప్రమేయం..
నవంబర్ 24, 2026

Jensen Huang | జెన్సన్ హువాంగ్‌కు హర్షధ్వానాలతో స్వాగతం పలికిన ఉద్యోగులు.. వీడియో..
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Online Betting | బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడ్డాడు.. అప్పు తీర్చలేక బాసర IIIT విద్యార్థి బలవన్మరణం
- ●Health | రోజుకు 20 నిమిషాల వ్యాయామం.. మెదడుకు సూపర్ బూస్ట్! జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు మేలు!
- ●Jensen Huang | ఎన్విడియా సీఈఓగా జెన్సన్ రాక, 31 శాతం ఎగసిన షేర్లు.. భారీగా పెరిగిన వ్యక్తిగత సంపద..
- ●Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక దీపం వేడుకలపై తీవ్ర ఉత్కంఠ.. మదురైలో 144 సెక్షన్ అమలు
- ●Thriller OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
- ●Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో మలుపు.. ఏ2గా సోదరుడు ప్రణయ్

Online Betting | బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడ్డాడు.. అప్పు తీర్చలేక బాసర IIIT విద్యార్థి బలవన్మరణం

Health | రోజుకు 20 నిమిషాల వ్యాయామం.. మెదడుకు సూపర్ బూస్ట్! జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు మేలు!

Jensen Huang | ఎన్విడియా సీఈఓగా జెన్సన్ రాక, 31 శాతం ఎగసిన షేర్లు.. భారీగా పెరిగిన వ్యక్తిగత సంపద..

Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక దీపం వేడుకలపై తీవ్ర ఉత్కంఠ.. మదురైలో 144 సెక్షన్ అమలు



