Rediff | మళ్లీ భారత మార్కెట్లోకి రెడిఫ్.. రూ.600 కోట్ల ఐపీఓకు సిద్ధం..
Rediff | ఒకప్పుడు భారత ఇంటర్నెట్ ప్రపంచంలో విశేష గుర్తింపు పొందిన రెడిఫ్ డాట్ కామ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నాస్‌డాక్‌లో గతంలో లిస్ట్ అయిన ఈ సంస్థ ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రూ.600 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సెబీకి అప్‌డేటెడ్ ఐపీఓ పత్రాలను సమర్పించింది.
Rediff | ఒకప్పుడు భారత ఇంటర్నెట్ ప్రపంచంలో విశేష గుర్తింపు పొందిన రెడిఫ్ డాట్ కామ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నాస్‌డాక్‌లో గతంలో లిస్ట్ అయిన ఈ సంస్థ ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రూ.600 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సెబీకి అప్‌డేటెడ్ ఐపీఓ పత్రాలను సమర్పించింది.
రూ.600 కోట్ల ఐపీఓకు సిద్ధం..
ఒకప్పుడు భారతీయులకు ఉచిత ఈమెయిల్ సేవలు, ఆన్‌లైన్ వార్తలను అందించిన ప్రముఖ డిజిటల్ వేదిక రెడిఫ్ డాట్ కామ్ (Rediff.com) మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రెడిఫ్ డాట్ కామ్ ఇండియా లిమిటెడ్ రూ.600 కోట్ల వరకు నిధులు సమీకరించేందుకు భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (సెబీ)కి అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించినట్లు నివేదికలు వెల్లడించాయి. గతంలో నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన ఈ సంస్థ, అనంతరం అవెన్యూస్ ఏఐ లిమిటెడ్ (గతంలో ఇన్ఫీబీమ్ అవెన్యూస్) కొనుగోలు చేయడంతో కొంతకాలంగా వార్తల్లో కనిపించకుండా పోయింది. తాజాగా ప్రతిపాదించిన ఐపీఓ పూర్తిగా కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా జరగనుంది. ఇందులో ఇప్పటికే ఉన్న వాటాదారులు తమ షేర్లను విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉండదు. ఈ ఐపీఓకు ఆగస్టులోనే సెబీ అనుమతి లభించింది.
నిధులను ఎలా ఖర్చు చేస్తుంది..?
సమీకరించనున్న నిధుల్లో రూ.224.8 కోట్లను రెడిఫ్ వన్, రెడిఫ్ పే, రెడిఫ్ టీవీ ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి, విస్తరణకు అవసరమైన మూలధన వ్యయాల కోసం వినియోగించాలని సంస్థ నిర్ణయించింది. మరో రూ.183.34 కోట్లను మార్కెటింగ్, బ్రాండింగ్ కార్యక్రమాలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను భవిష్యత్తులో ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించనుంది. ప్రస్తుతం అవెన్యూస్ ఏఐ అనుబంధ సంస్థగా ఉన్న రెడిఫ్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ రంగాల్లో సేవలు అందిస్తోంది. అవెన్యూస్ ఏఐ సంస్థ సీసీఏవెన్యూ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ను, బిల్డా బజార్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌ను కూడా నిర్వహిస్తోంది.
ఈ-మెయిల్ సేవల ద్వారా గుర్తింపు..
1996లో ఇంటర్నెట్ పోర్టల్, డిజిటల్ మీడియా సంస్థగా ప్రారంభమైన రెడిఫ్, రెడిఫ్ న్యూస్ ద్వారా వార్తా రంగంలోకి ప్రవేశించింది. 1998లో ఉచిత ఈమెయిల్ సేవ రెడిఫ్ మెయిల్‌ను ప్రారంభించింది. అనంతరం 2007లో మనీ విజ్ ద్వారా వ్యక్తిగత ఆర్థిక సేవల్లోకి విస్తరించింది. మొబైల్ అప్లికేషన్లు, ఎంటర్‌ప్రైజ్ ప్రొడక్టివిటీ టూల్స్, ఈ-కామర్స్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. తన ఎంటర్‌ప్రైజ్ సేవలను రెడిఫ్ వన్ బ్రాండ్ కింద ఏకీకృతం చేయడంతోపాటు బిల్డా బజార్‌ను రెడిఫ్ కామర్స్‌గా రీబ్రాండ్ చేసింది. 2025 జూలైలో రెడిఫ్ టీవీ పేరుతో డిజిటల్ వీడియో, కంటెంట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. అదే ఏడాది డిసెంబర్‌లో రెడిఫ్ పే ద్వారా యూపీఐ పరిధిలో థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా కార్యకలాపాలు నిర్వహించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి అనుమతి పొందింది. ఈ ఐపీఓకు కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా, ఎంయూఎఫ్‌జీ ఇంటైమ్ ఇండియా రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold | పెట్టుబడిదారులకు బంగారం భారీ షాక్.. వారం రోజుల్లోనే 9 శాతం పతనం..
- ●Spurious Liquor | కల్తీ మద్యం కలకలం.. 15 మంది మృతి, 180 మందికి అస్వస్థత
- ●AI Generated Photo | ఏఐ ఫొటో తెచ్చిన తంటా.. మరో మహిళతో భర్త.. చితకబాదిన భార్య
- ●ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!
- ●Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు
- ●Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..

Gold | పెట్టుబడిదారులకు బంగారం భారీ షాక్.. వారం రోజుల్లోనే 9 శాతం పతనం..

Spurious Liquor | కల్తీ మద్యం కలకలం.. 15 మంది మృతి, 180 మందికి అస్వస్థత

AI Generated Photo | ఏఐ ఫొటో తెచ్చిన తంటా.. మరో మహిళతో భర్త.. చితకబాదిన భార్య

ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!






