త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadeeshwar Rao | ఆర్వోకు నామినేష‌న్‌ను తిర‌స్క‌రించే అధికారం లేదు: టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు జ‌గ‌దీశ్వ‌ర్‌రావు

Jagadeeshwar Rao | రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌ను తిర‌స్క‌రించే అధికారం ఆర్వోకు లేదని టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు జ‌గ‌దీశ్వ‌ర్‌రావు పేర్కొన్నారు. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను, జ్యుడీషియ‌రీని బీజేపీ పావులా వాడుకుంటుంద‌ని ఆయ‌న ఆరోపించారు.

S

Telangana | Published On Jun 11, 2026, 3.21 pm IST

Jagadeeshwar Rao | ఆర్వోకు నామినేష‌న్‌ను తిర‌స్క‌రించే అధికారం లేదు: టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు జ‌గ‌దీశ్వ‌ర్‌రావు
Advertisement

Jagadeeshwar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌ను తిర‌స్క‌రించే అధికారం ఆర్వోకు లేదని టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు జ‌గ‌దీశ్వ‌ర్‌రావు పేర్కొన్నారు. గతంలో ఆర్వో నామినేషన్ తిరస్కరించిన క్రమంలో చీఫ్ ఎలక్షన్ సరి చేసిన సందర్బాలు చాలా ఉన్నాయ‌ని గుర్తు చేశారు. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను, జ్యుడీషియ‌రీని బీజేపీ పావులా వాడుకుంటుంద‌ని ఆయ‌న ఆరోపించారు.

324 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల సంఘానికి కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. మోడీ ప్రభుత్వంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం లేదు. ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసారు. దర్యాప్తు సంస్థలను, జ్యుడీషియ‌రీని బీజేపీ వాడుకుంటోంది. బలం లేకున్నా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలో పెట్టి కుట్రకూ తెర లేపింది. ప్రాథ‌మిక దశలో ఉన్న కేసును సాకుగా చూపి రాజ్యసభ గెలవాలనుకుంటుంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలి అని జ‌గ‌దీశ్వ‌ర్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement