Samsung The Big Bespoke AI Fest 2026 | శాంసంగ్ ఇండియా ఫెస్టివల్ సేల్.. ఏఐ గృహోపకరణాలపై భారీ తగ్గింపు ధరలు..
Samsung The Big Bespoke AI Fest 2026 | ఉగాది, గుడి పడ్వా, రంజాన్ పండుగల సందర్బంగా భారతీయ వినియోగదారుల కోసం శాంసంగ్ ఇండియా ప్రత్యేకంగా ది బిగ్ బిస్పోక్ ఏఐ ఫెస్ట్ పేరిట ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే అందుబాటులో ఉండగా ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.
Samsung The Big Bespoke AI Fest 2026 | ఉగాది, గుడి పడ్వా, రంజాన్ పండుగల సందర్బంగా భారతీయ వినియోగదారుల కోసం శాంసంగ్ ఇండియా ప్రత్యేకంగా ది బిగ్ బిస్పోక్ ఏఐ ఫెస్ట్ పేరిట ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే అందుబాటులో ఉండగా ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా శాంసంగ్‌కు చెందిన బిస్పోక్ ఏఐ హోం అప్లయెన్సెస్‌పై తగ్గింపు ధరలను, ఆఫర్లను అందిస్తున్నట్లు తెలియజేసింది. ఏఐ ఆధారంగా పనిచేసే గృహోపకరణాలను తగ్గింపు ధరలకే ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా బిస్పోక్ ఏఐ ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్‌లను కొనుగోలు చేస్తే రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తున్నారు.
జీరో డౌన్ పేమెంట్‌తో కొనవచ్చు..
సులభమైన ఫైనాన్స్ ఆప్షన్‌లను కూడా ఈ సేల్‌లో అందిస్తున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. వినియోగదారులు తమకు నచ్చిన మోడల్స్‌ను జీరో డౌన్ పేమెంట్ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఏసీలను కొనుగోలు చేస్తే ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను అందిస్తున్నామని, ఏసీలపై 5 ఏళ్ల వరకు వారంటీని సైతం అందిస్తున్నట్లు పేర్కొంది. ఇక శాంసంగ్‌కు చెందిన బిస్పోక్ ఏఐ ఉత్పత్తుల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. అన్ని రకాల విభాగాల్లోని మోడల్స్‌లో ఏఐ ఉన్న ఉత్పత్తుల్లో ఆకట్టుకునే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏఐ ఆధారిత ఉత్పత్తులు అన్నీ విద్యుత్‌ను ఎంతో గణనీయంగా పొదుపు చేస్తాయని తెలిపింది.
బిస్పోక్ ఏఐ ఉపకరణాలలోని ఫీచర్లు..
బిస్పోక్ ఏఐ ఏసీల్లో ఫాస్ట్ అండ్ కమ్‌ఫర్ట్ కూలింగ్ ఫీచర్‌ను ఇస్తుండగా, ఇది గదిని చాలా వేగంగా చల్లబరుస్తుంది. ఎయిర్‌ఫ్లో అడ్జస్ట్‌మెంట్ కూడా సరిగ్గా ఉంటుంది. శాంసంగ్‌కు చెందిన స్మార్ట్ థింగ్స్ హోమ్ కేర్ ఏసీ పనితనాన్ని పర్యవేక్షిస్తుంది. గ్యాస్ తక్కువ ఉన్నా, ఫిల్టర్ మార్చాల్సి వచ్చినా, ఇతర ఎమర్జెన్సీ అవసరాలు ఉన్నా వినియోగదారులకు ముందుగానే అలర్ట్స్‌ను పంపిస్తుంది. బిస్పోక్ ఏఐ ఫ్రిజ్‌లలో ఏఐ విజన్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇది ఫ్రిజ్‌లో ఉన్న ఫుడ్ ఐటమ్స్‌ను గుర్తిస్తుంది. వాటికి అనుగుణంగా చల్లదనాన్ని ఇస్తుంది. బిస్పోక్ ఏఐ వాషింగ్ మెషిన్లలో దుస్తులను వేసిన బరువును, దుస్తుల రకాన్ని బట్టి నీళ్లను తగిన మోతాదులో ఉపయోగిస్తూ, తక్కువ డిటర్జెంట్ వాడుతూ వాషింగ్ మెషిన్ మన్నికగా పనిచేసేలా ఫీచర్లను ఇచ్చారు. ఇక స్మార్ట్ థింగ్స్ ఫ్యామిలీ కేర్ ద్వారా వాషింగ్ మెషిన్ యాక్టివిటీకి చెందిన నోటిఫికేషన్లను పొందవచ్చు. అలాగే మెడికేషన్, అపాయింట్‌మెంట్ రిమైండర్లను తెలియజేస్తుంది. లొకేషన్ ఆధారిత అలర్ట్స్‌ను యూజర్లకు, కేర్ గివర్స్‌కు అందిస్తుంది. ఈ సేల్ శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అన్ని ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ఎంపిక చేసిన రిటెయిల్ ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉందని శాంసంగ్ వెల్లడించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Itel | గృహోపకరణాల రంగంలోకి ఐటెల్.. చవక ధరలకే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు..
ఆగస్టు 15, 2026

Galaxy Z Fold 8 | గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, ఫ్లిప్ 8 సేల్స్ షురూ.. 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ..
ఆగస్టు 14, 2026

Samsung | శాంసంగ్ బంపర్ ఆఫర్.. ఫోల్డబుల్ ఫోన్లపై 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ.. జీరో డౌన్ పేమెంట్‌తో..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Faria Abdullah | బోనాల జాతరలో పాల్గొనడంపై విమర్శలు - ఫరియా అబ్దుల్లా ఎమోషనల్
- ●Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా
- ●Samantha | కత్తి పట్టిన సమంత - నాలుగేళ్ల తర్వాత మాతృభాషలోకి రీఎంట్రీ - మాస్టర్ చెఫ్ ప్రోమో రిలీజ్
- ●CM Revanth Reddy | ఎంతమందికైనా సరే.. పెన్షన్లు ఇస్తాం
- ●MLA Rajagopal Reddy | మీనాక్షికి చెప్పినా భయపడా.. నాకు చెప్పే బదులు రేవంత్‌కు చెప్పండి
- ●Prabhas Fauzi | ఇదేం వెరైటీ - ప్రభాస్ ఫౌజీ పోస్టర్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్

Faria Abdullah | బోనాల జాతరలో పాల్గొనడంపై విమర్శలు - ఫరియా అబ్దుల్లా ఎమోషనల్

Harish Rao vs Revanth Reddy | నీ ఊరికి వస్తా.. రుణమాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా

Samantha | కత్తి పట్టిన సమంత - నాలుగేళ్ల తర్వాత మాతృభాషలోకి రీఎంట్రీ - మాస్టర్ చెఫ్ ప్రోమో రిలీజ్

CM Revanth Reddy | ఎంతమందికైనా సరే.. పెన్షన్లు ఇస్తాం



