Samsung Galaxy S26 | తక్కువ ధరలకే గెలాక్సీ ఎస్26 ఫోన్లు.. శాంసంగ్ రీన్యూడ్ ప్రోగ్రామ్‌లో ఆఫర్..
Samsung Galaxy S26 | శామ్‌సంగ్ ఇండియా తన సర్టిఫైడ్ రీన్యూడ్ కార్యక్రమాన్ని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా చేర్చింది. దీంతో వినియోగదారులు శామ్‌సంగ్ అధికారిక మార్గాల ద్వారా ఈ ఏఐ స్మార్ట్‌ఫోన్లను రిఫర్బిష్డ్ రూపంలో కొనుగోలు చేసే అవకాశం లభించింది.
Technology | Published On Sep 11, 2026, 1.23 pm IST
Samsung Galaxy S26 | శామ్‌సంగ్ ఇండియా తన సర్టిఫైడ్ రీన్యూడ్ కార్యక్రమాన్ని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా చేర్చింది. దీంతో వినియోగదారులు శామ్‌సంగ్ అధికారిక మార్గాల ద్వారా ఈ ఏఐ స్మార్ట్‌ఫోన్లను రిఫర్బిష్డ్ రూపంలో కొనుగోలు చేసే అవకాశం లభించింది. శామ్‌సంగ్ సర్టిఫైడ్ రీన్యూడ్ కార్యక్రమాన్ని ఈ ఏడాది మేలో ప్రారంభించింది. తొలుత గెలాక్సీ ఎస్25, ఎస్25 అల్ట్రా, ఎంపిక చేసిన ఎ సిరీస్ ఫోన్లను ఈ కార్యక్రమంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు గెలాక్సీ ఎస్26 సిరీస్‌ను కూడా ఇందులో చేర్చింది. భారత్‌లో సర్టిఫైడ్ రీన్యూడ్ గెలాక్సీ ఎస్26 256 జీబీ వేరియంట్ ధర రూ.74,799గా ఉంది. 512 జీబీ వేరియంట్ ధరను రూ.91,799గా నిర్ణయించారు. గెలాక్సీ ఎస్26 అల్ట్రా 256 జీబీ మోడల్ ధర రూ.1,18,999 కాగా, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,35,999గా ఉంది.
క్షుణ్ణంగా చెకింగ్..
సర్టిఫైడ్ రీన్యూడ్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఫోన్‌ను శామ్‌సంగ్ క్షుణ్ణంగా పరిశీలించి, శుభ్రం చేసి, పరీక్షిస్తుంది. అవసరమైన మరమ్మత్తులు ఉంటే ఒరిజినల్ శామ్‌సంగ్ విడిభాగాలతోనే చేపడుతుంది. బ్యాటరీ కూడా శామ్‌సంగ్ నిర్దేశించిన నాణ్యత, విశ్వసనీయత, పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరించిన తర్వాతే ఫోన్‌ను విక్రయానికి అందుబాటులో ఉంచుతుంది. అలాగే గత వినియోగదారుల వ్యక్తిగత డేటా పూర్తిగా తొలగించిన తర్వాత ఫోన్‌ను తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కు అప్‌డేట్ చేస్తారు. సర్టిఫైడ్ రీన్యూడ్ గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లకు ఒక ఏడాది తయారీదారు వారంటీని కూడా శామ్‌సంగ్ అందిస్తోంది.
భారత్‌లో రిఫర్బిష్డ్ గెలాక్సీ ఎస్26 సిరీస్‌ను శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్, అధికారిక శామ్‌సంగ్ షాప్ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే మోడల్, రంగు, స్టోరేజ్ సామర్థ్యం, ధర వంటి వివరాలు అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Mahesh Goud | పాపం పండి ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ●Jupally Krishna Rao | అటవీ సిబ్బందికి ఆయుధాలు అవసరం.. రూ.4.095 కోట్ల ప్రతిపాదనలు చేశాం
- ●ED Raids | కోల్‌కతాలో బొగ్గు కుంభకోణం.. హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
- ●Demat 2.0 | డీమ్యాట్ 2.0: బాండ్లలో డిజిటల్ విప్లవం.. ఇక నగదు, బాండ్ ఒకేసారి సెటిల్మెంట్
- ●KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్
- ●Shashi Tharoor | గ్లోబల్ సౌత్‌కు ఇది అత్యంత కీలక వేదిక.. బ్రిక్స్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు

Mahesh Goud | పాపం పండి ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Jupally Krishna Rao | అటవీ సిబ్బందికి ఆయుధాలు అవసరం.. రూ.4.095 కోట్ల ప్రతిపాదనలు చేశాం

ED Raids | కోల్‌కతాలో బొగ్గు కుంభకోణం.. హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

Demat 2.0 | డీమ్యాట్ 2.0: బాండ్లలో డిజిటల్ విప్లవం.. ఇక నగదు, బాండ్ ఒకేసారి సెటిల్మెంట్




