Samsung Galaxy S26 | శాంసంగ్ ఫోన్‌ను కొనాలంటే ఇప్పుడే తీసుకోండి.. భారీగా పెరగనున్న ధరలు..
Samsung Galaxy S26 | శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్ల ధరలను భారత్‌లో పెంచేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు స్టోరేజ్ వేరియంట్ల ధరలను రూ.12వేల చొప్పున పెంచే అవకాశం ఉందని టిప్‌స్టర్ సంజు చౌదరి తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ ధరల పెంపుపై శామ్‌సంగ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
Technology | Published On Sep 18, 2026, 1.44 pm IST
Samsung Galaxy S26 | శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్ల ధరలను భారత్‌లో పెంచేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు స్టోరేజ్ వేరియంట్ల ధరలను రూ.12వేల చొప్పున పెంచే అవకాశం ఉందని టిప్‌స్టర్ సంజు చౌదరి తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ ధరల పెంపుపై శామ్‌సంగ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. టిప్‌స్టర్ సంజు చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. గెలాక్సీ ఎస్26 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.87,999 నుంచి రూ.99,999కు పెరగనుంది. అలాగే 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,07,999 నుంచి రూ.1,19,999కు చేరే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో గెలాక్సీ ఎస్26 12 జీబీ, 256 జీబీ వేరియంట్ రూ.79,999కు, 12 జీబీ, 512 జీబీ వేరియంట్ రూ.99,999కు అందుబాటులో ఉన్నాయి.
భారీగా ధరలు పెరిగే అవకాశం..
గెలాక్సీ ఎస్26తో పాటు శామ్‌సంగ్ ఇతర ప్రీమియం ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. గెలాక్సీ ఎస్26 అల్ట్రా ధరను కూడా పెంచే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే కొత్త ధర ఎంత, పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అదేవిధంగా గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండు మోడళ్లకు సంబంధించిన ధరల పెంపు కూడా ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. గెలాక్సీ ఎస్26 అల్ట్రా ధర పెరిగితే అది భారత్‌లో ఐఫోన్ 18 ప్రొ ధరకు సమీపించే అవకాశం ఉందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 18 ప్రొ ప్రారంభ ధర రూ.1,64,900గా ఉంది. మరోవైపు గెలాక్సీ ఎస్26 అల్ట్రా ప్రస్తుత ప్రారంభ ఎంఆర్‌పీ రూ.1,39,999గా ఉంది.
20వ తేదీ తరువాత పెంపు..?
కాగా గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 కొనుగోలుదారుల కోసం శామ్‌సంగ్ ఇటీవల భారత్‌లో 24 నెలల గెలాక్సీ ఫరెవర్ చెల్లింపు విధానాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ఫోన్ ధరలో 60 శాతాన్ని ఈఎంఐల ద్వారా చెల్లించాలి. మిగిలిన 40 శాతాన్ని ఈఎంఐ కాలం ముగిసే వరకు వాయిదా వేయవచ్చు. ఈ పథకంలో గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 అల్ట్రా నెలవారీ ఈఎంఐ రూ.9,417 నుంచి రూ.6,997కు తగ్గింది. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 ఈఎంఐ రూ.8,584 నుంచి రూ.6,416కు తగ్గినట్లు శామ్‌సంగ్ వెల్లడించింది. అయితే గెలాక్సీ ఎస్26 సహా శామ్‌సంగ్ ప్రీమియం మోడళ్ల ధరల పెంపుపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఈ నెల 20వ తేదీ తరువాతి నుంచి ఆయా ఫోన్ల ధరలను శాంసంగ్ పెంచనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Trisha | చెన్నై క్వీన్ డబుల్ ధమాకా - సంక్రాంతి బరిలో త్రిష రెండు సినిమాలు
- ●Privilege Notice Against CM Revanth | సీఎం రేవంత్‌పై సభా హక్కుల నోటీస్.. స్పీకర్‌కు అందజేసిన బీఆర్ఎస్ శాసన సభాపక్షం
- ●Air Passengers | పిడిగుద్దుల వర్షం.. విమానంలో దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు
- ●Young man’s suicide | ప్రియురాలి వల్లే చనిపోతున్నా.. స్టీల్ బ్రిడ్జి పైనుంచి దూకిన యువకుడు
- ●Ponguleti Srinivas Reddy | 22ఏ సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు
- ●Air India Express | బ్రీత్టెస్ట్కు హాజరుకాని ఎయిర్ ఇండియా సిబ్బంది.. 8 మందిపై వేటు

Trisha | చెన్నై క్వీన్ డబుల్ ధమాకా - సంక్రాంతి బరిలో త్రిష రెండు సినిమాలు

Privilege Notice Against CM Revanth | సీఎం రేవంత్‌పై సభా హక్కుల నోటీస్.. స్పీకర్‌కు అందజేసిన బీఆర్ఎస్ శాసన సభాపక్షం

Air Passengers | పిడిగుద్దుల వర్షం.. విమానంలో దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు

Young man’s suicide | ప్రియురాలి వల్లే చనిపోతున్నా.. స్టీల్ బ్రిడ్జి పైనుంచి దూకిన యువకుడు





