US Visa | అమెరికా వీసా కావాలా..? ఏయే నగరాల్లో వెయిట్ టైమ్ ఎంతంటే..?
US Visa | ఈ ఏడాది అమెరికా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? పర్యటన కావచ్చు, వ్యాపార ప్రయాణం కావచ్చు లేదా కుటుంబ సభ్యులను కలవాలన్న ఉద్దేశం కావచ్చు.. ఏదైనా సరే వీసా కోసం మాత్రం ముందే ప్లాన్ చేసుకోవాల్సిందే. చాలా మంది భారతీయ ప్రయాణికులకు అమెరికా ప్రయాణం అనగానే అసలు సవాలు విమాన టికెట్ కంటే ముందే మొదలవుతోంది.
US Visa | ఈ ఏడాది అమెరికా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? పర్యటన కావచ్చు, వ్యాపార ప్రయాణం కావచ్చు లేదా కుటుంబ సభ్యులను కలవాలన్న ఉద్దేశం కావచ్చు.. ఏదైనా సరే వీసా కోసం మాత్రం ముందే ప్లాన్ చేసుకోవాల్సిందే. చాలా మంది భారతీయ ప్రయాణికులకు అమెరికా ప్రయాణం అనగానే అసలు సవాలు విమాన టికెట్ కంటే ముందే మొదలవుతోంది. అదే అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ (US Department of State) విడుదల చేసిన Global Visa Wait Times అప్‌డేట్‌తో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం వీసా ఇంటర్వ్యూలకు ఎంతకాలం వేచిచూడాల్సి వస్తుందన్న విషయంపై స్పష్టత వచ్చింది.
వీసా డేటాలో చూపే Average Wait Time అనేది మీరు ఫీజు చెల్లించిన తేదీ నుంచి ఇంటర్వ్యూ జరిగిన తేదీ వరకు, గత నివేదిక కాలంలో అభ్యర్థులు ఎదుర్కొన్న సగటు వెయిట్ టైమ్‌ను సూచిస్తుంది. ఇది వెంటనే లభించే అపాయింట్‌మెంట్‌ను సూచించదు. అపాయింట్‌మెంట్ రద్దు, అదనపు స్లాట్లు, సిబ్బంది లభ్యత, సీజనల్ డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. అంటే ఇది గ్యారెంటీ టైమ్‌లైన్ కాదు.. ఒక అంచనా మాత్రమే.
ఆయా నగరాల్లో పరిస్థితి ఇలా..
భారత నగరాల్లో B1/B2 వీసా ఇంటర్వ్యూలకు గాను సగటు వెయిట్ టైమ్, ఫిబ్రవరి 13, 2026 నాటికి విడుదలైన తాజా గణాంకాల ప్రకారం ప్రధాన నగరాల్లో పరిస్థితి ఇలా ఉంది.
న్యూఢిల్లీలో అమెరికా B1/B2 వీసా ఇంటర్వ్యూలకు గాను సగటు వెయిట్ టైమ్ సుమారు 6.5 నెలలు ఉండగా, ముంబైలో 9.5 నెలలు, చెన్నై 1.5 నెలలు, హైదరాబాద్ 7.5 నెలలు, కోల్‌కతాలో 2.5 నెలలుగా ఉంది. ఈ జాబితాలో ముంబైలో అత్యధికంగా 9.5 నెలల వెయిట్ టైమ్‌ను కలిగి ఉండగా, చెన్నైలో అతి తక్కువగా 1.5 నెలలే ఉంది.
కరోనా కాలంలో ఏర్పడిన పెండింగ్ అప్లికేషన్‌లను క్లియర్ చేయడంలో అమెరికా కాన్సులేట్లు గత ఏడాది కొంత పురోగతి సాధించినప్పటికీ, కొన్ని మెట్రో నగరాల్లో డిమాండ్ ఇంకా ఎక్కువగానే ఉంది. అందుకే 2026లో అమెరికా వెళ్లాలని భావిస్తున్నవారు ముందుగానే ప్రణాళిక చేసుకోవడం అవసరం. వీసా ఇంటర్వ్యూ తేదీ ఖరారు కాకముందే ప్రయాణ తేదీలను నిర్ణయించుకోవడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అపాయింట్‌మెంట్ లభ్యత తరచూ మారే అవకాశం ఉన్నందున, అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం చెక్ చేస్తూ, ఇంటర్వ్యూ స్లాట్ ఖరారైన తర్వాతే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా సమాచారం కోసం ఎప్పుడూ US Department of State - Global Visa Wait Times అధికారిక పేజీనే సందర్శించాలని సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CWG 2026 | తృటిలో చేజారిన స్వర్ణం.. కామన్వెల్త్లో మెరిసిన సిల్వర్‌తో మెరిసిన జ్ఞానేశ్వరి..
జులై 27, 2026

Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చడం పాలన అనిపించుకోదు
జులై 27, 2026

Gen-Z Plantation | కేంద్రంపై జెంజీల గెలుపు.. చిహ్నంగా మొక్కలు నాటి సంబరాలు
జులై 27, 2026
తాజావార్తలు
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి
- ●DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?



