త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Retail Inflation | మార్చి నెల‌లో పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం.. లోహాలు, కూర‌గాయ‌ల ధ‌ర‌లు పైపైకి..

Retail Inflation | భారత్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (ద్ర‌వ్యోల్బ‌ణం) లేదా కన్‌జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 3.4 శాతం పెరిగింది. ఇది అంత‌కు ముందు నెలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా ఉందని సోమవారం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) విడుదల చేసిన డేటాలో తెలిపింది.

S

Business | Published On Apr 13, 2026, 5.01 pm IST

Retail Inflation | మార్చి నెల‌లో పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం.. లోహాలు, కూర‌గాయ‌ల ధ‌ర‌లు పైపైకి..
Advertisement

Retail Inflation | భారత్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (ద్ర‌వ్యోల్బ‌ణం) లేదా కన్‌జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 3.4 శాతం పెరిగింది. ఇది అంత‌కు ముందు నెలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా ఉందని సోమవారం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) విడుదల చేసిన డేటాలో తెలిపింది. ఈ సంఖ్య బ్లూమ్‌బర్గ్ ట్రాక్ చేసిన అనలిస్టుల అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలింది. గత నెలలో ద్రవ్యోల్బణం 3.21 శాతంగా నమోదైంది. ఈ పెరుగుదల ఉన్నప్పటికీ రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం ఇంకా ఆర్బీఐ స్వ‌ల్ప‌కాల లక్ష్యం అయిన 4 శాతం లోపే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఫిబ్రవరిలో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 3.21 శాతం ఉండగా, జనవరిలో ఇది 2.75 శాతంగా నమోదైంది. కొత్త సీపీఐ సిరీస్ ప్రకారం, బేస్ ఇయర్‌ను 2012 నుంచి 2024కి మార్చారు.

పెరిగిన అర్బ‌న్‌, గ్రామీణ ద్ర‌వ్యోల్బ‌ణం..

మార్చిలో సీపీఐ ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం 3.87 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో న‌మోదైన‌ 3.47 శాతంతో పోలిస్తే కాస్త‌ పెరిగింది. ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్‌లో ద్ర‌వ్యోల్బ‌ణం 3.71 శాతంగా ఉంది. కోర్ ద్ర‌వ్యోల్బ‌ణం (ఫుడ్, ఫ్యుయల్ ధరలను మినహాయించి) 3.3 శాతం వద్ద స్థిరంగా ఉంది. అర్బన్ ద్ర‌వ్యోల్బ‌ణం ఫిబ్రవరిలో 3.02 శాతం ఉండ‌గా మార్చిలో 3.11 శాతానికి పెరిగింది. అలాగే గ్రామీణ ద్ర‌వ్యోల్బ‌ణం కూడా ఫిబ్రవరిలో 3.37 శాతం ఉండ‌గా మార్చిలో అది 3.63 శాతానికి పెరిగింది.

లోహాలు, కూర‌గాయ‌ల ధ‌ర‌ల్లోనూ పెరుగుద‌ల‌..

గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్‌, గ్యాస్, ఇతర ఇంధ‌న‌ ధరలు 1.97 శాతంగా ఉన్నాయి. దుస్తులు, ఫుట్‌వేర్ ధరలలో ద్ర‌వ్యోల్బ‌ణం 2.75 శాతంగా నమోదైంది. పాన్, పొగాకు వంటి మ‌త్తు ప‌దార్థాల‌ ధరలు 4.23 శాతంగా ఉన్నాయి. కమోడిటీస్, కూరగాయ‌ల విభాగంలో అత్యధిక ధరల పెరుగుదల వెండి (148.61 శాతం), గోల్డ్/డైమండ్/ప్లాటినం (45.92 శాతం) ల‌లో చోటు చేసుకోగా కొబ్బరి (45.52 శాతం), టమాటా (35.99 శాతం), కాలీఫ్లవర్ (34.11 శాతం) ధ‌ర‌ల‌లోనూ పెరుగుద‌ల‌ నమోదైంది. ఇక వెల్లుల్లి, ఉల్లిపాయ, ఆలుగ‌డ్డ‌లు, కందిప‌ప్పు వంటి ఆహారాల ధరలు మార్చిలో తగ్గుముఖం పట్టాయి.

Advertisement
Advertisement