RBI | ఆర్బీఐ కఠిన చర్యలు.. బ్యాంకుపై ఆంక్షలు, డిపాజిటర్లకు కీలక సూచనలు..
RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించిన మూడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ఓ సహకార బ్యాంకుపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. కొన్నింటిపై జరిమానాలు విధించగా, ఒక బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది.
RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించిన మూడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ఓ సహకార బ్యాంకుపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. కొన్నింటిపై జరిమానాలు విధించగా, ఒక బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. ఈ వివరాలను ఆర్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1934 ఆర్బీఐ యాక్ట్‌లోని వివిధ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ముంబైకి చెందిన మోగావీర్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు కఠిన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12 నుంచి ఆరు నెలల పాటు బ్యాంకు తన సాధారణ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ కాలంలో బ్యాంకు కొత్త రుణాలు మంజూరు చేయడం, ఇప్పటికే ఉన్న రుణాలను పునరుద్ధరించడం లేదా ఇతర ఆర్థిక ఒప్పందాల్లో పాల్గొనడాన్ని అనుమతించరు. బ్యాంకు లిక్విడిటీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
ఇది లైసెన్స్ రద్దు కాదు..
అయితే ఈ చర్యను బ్యాంకు లైసెన్స్ రద్దుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. వచ్చే ఆరు నెలల పాటు పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ ఆదేశాల ప్రభావం బ్యాంకు ఖాతాదారులపై కూడా ఉంటుంది. ప్రజల సమాచారం కోసం ఆదేశాల ప్రతిని బ్యాంకు వెబ్‌సైట్ లేదా శాఖ ప్రాంగణంలో ప్రదర్శించాలని ఆర్బీఐ సూచించింది. డిపాజిటర్లకు కొంత ఊరట కల్పిస్తూ, ఒక్కో ఖాతాదారు గరిష్టంగా రూ.1 లక్ష వరకు నగదు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆర్బీఐ నిర్దేశించిన షరతుల మేరకు డిపాజిట్లకు వ్యతిరేకంగా రుణాల సర్దుబాటు, ఉద్యోగుల జీతాలు, అద్దె, విద్యుత్ బిల్లులు వంటి అవసరమైన ఖర్చులు చెల్లించడానికి కూడా అనుమతి ఉంటుంది. ఇక డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నిబంధనల ప్రకారం, ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్లపై గరిష్టంగా రూ.5 లక్షల వరకు బీమా క్లెయిమ్ పొందే అర్హత కలిగి ఉంటారు.
సంబంధిత వార్తలు

RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..
జులై 16, 2026

RBI | ఇక బ్యాంకులు బలవంతంగా ఆర్థిక ఉత్పత్తులను విక్రయించడం కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..
జులై 14, 2026

Harish Rao | కేసీఆర్ ఏం చేశారని అంటున్నారు.. వాళ్లకు ఈ నలుపు-తెలుపు అక్షరాలే బలమైన సమాధానం
జులై 11, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్



