Devi Prasad | అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలి : దేవీప్రసాద్
Devi Prasad | రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.
Devi Prasad | రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు బాలల సంక్షేమం, గర్భిణీలు, బాలింతల సేవలో కీలక పాత్ర పోషించిన అంగన్‌వాడీ సిబ్బందికి రావాల్సిన ప్రయోజనాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందకపోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిటైర్ అయిన 3,587 మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు సుమారు రూ.21.39 కోట్ల మేర రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 1,310 మందికి మాత్రమే రూ.7.98 కోట్లు అందాయని తెలిపారు. ఇంకా 2,277 మంది సిబ్బందికి రూ.13.41 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
పదవీ విరమణ అనంతరం ఆర్థిక భరోసాగా ఉండాల్సిన ఈ నిధులు ఆలస్యమవడంతో పలువురు వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దేవీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన సిబ్బందికి రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేయడం సమంజసం కాదన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి అర్హులైన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాతాల్లో జమ చేయాలని ఆయన కోరారు. అలాగే భవిష్యత్తులో పదవీ విరమణ పొందే సిబ్బందికి ఎటువంటి జాప్యం లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని దేవీప్రసాద్ విమర్శించారు. వేతనాలు పెంచుతామని ప్రకటించి 30 నెలలు గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. నెలవారీ వేతనాలు కూడా పలుమార్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అప్‌గ్రేడ్ అయిన మినీ అంగన్‌వాడీ టీచర్లకు గత 14 నెలలుగా వేతనాలు అందడం లేదని ఆయన ఆరోపించారు. అంగన్‌వాడీ టీచర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయడంతో పాటు వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్
- ●Red Chilli Powder | కారం పొడిలో 30 శాతం రంపపు పొడి.. 3,350 కిలోలు సీజ్
- ●స్పందనలో వేగం… నిరంతర ఉద్యమాల్లో పరిమితులు: బీఆర్ఎస్ పోరాటానికి 40-45% మార్కులేనా?
- ●Kalyana Lakshmi | పెళ్లై పిల్లలు కూడా పుట్టారు.. ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు
- ●RSP | రేవంతూ.. మీరు పాలిటెక్నిక్ చేసి బీఏ చేయగలిగినప్పుడు.. ఈ పిల్లలు ఈసెట్‌కు పోతే తప్పేముంది..?
- ●Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై

KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్

Red Chilli Powder | కారం పొడిలో 30 శాతం రంపపు పొడి.. 3,350 కిలోలు సీజ్

స్పందనలో వేగం… నిరంతర ఉద్యమాల్లో పరిమితులు: బీఆర్ఎస్ పోరాటానికి 40-45% మార్కులేనా?

Kalyana Lakshmi | పెళ్లై పిల్లలు కూడా పుట్టారు.. ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు




