త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | ఆర్బీఐ వ‌డ్డీరేట్లు యథాతథం

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను మ‌రోసారి యథాతథంగా 5.25 శాతం వద్దే ఉంచింది.

D

Business | Published On Feb 6, 2026, 10.43 am IST

RBI | ఆర్బీఐ వ‌డ్డీరేట్లు యథాతథం
Advertisement

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను మ‌రోసారి యథాతథంగా 5.25 శాతం వద్దే ఉంచింది. ఈ మేర‌కు ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌లో తీసుకున్న నిర్ణ‌యాల‌ను శుక్ర‌వారం ఉద‌యం ఆర్బీఐ గ‌ర‌వ్న‌ర్ (RBI Governor) సంజ‌య్ మ‌ల్హోత్ర (Sanjay Malhotra) మీడియాకు వెల్ల‌డించారు. ఈ సారి రెపోరేటు (repo rate)లో ఎలాంటి మార్పూ లేద‌ని ప్ర‌క‌టించారు.

కాగా, గ‌తేడాది వ‌డ్డీరేట్ల‌ను ఆర్బీఐ ప‌లుమార్లు స‌వ‌రించిన విష‌యం తెలిసిందే. గ‌తేడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. జూన్‌ సమీక్షలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్‌లో పావు శాతం త‌గ్గించ‌డంతో వ‌డ్డీరేటు 5.25 శాతానికి చేరింది. ఇప్పుడు వ‌డ్డీరేట్ల‌ను య‌థాతథంగా ఉంచాల‌ని నిర్ణ‌యించింది. ఇక జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.

Advertisement
Advertisement