త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Death Threat | అత‌న్ని పేల్చేస్తా.. గ‌వ‌ర్న‌ర్‌ను చంపుతానంటూ బెదిరింపు మెయిల్‌..

ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌ను (Bengal Governor) చంపుతామంటూ బెదిరింపు (Death Threat) మెయిల్ వ‌చ్చింది. దీంతో లోక్‌భ‌వ‌న్ (రాజ్‌భ‌వ‌న్) వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

G

National | Published On Jan 9, 2026, 8.07 am IST

Death Threat | అత‌న్ని పేల్చేస్తా.. గ‌వ‌ర్న‌ర్‌ను చంపుతానంటూ బెదిరింపు మెయిల్‌..
Advertisement

trinethra.news: ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌ను (Bengal Governor) చంపుతామంటూ బెదిరింపు (Death Threat) మెయిల్ వ‌చ్చింది. దీంతో లోక్‌భ‌వ‌న్ (రాజ్‌భ‌వ‌న్) వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. గురువారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద బోస్‌ను (CV Ananda Bose) చంపుతామంటూ బెదిరింపు మెయిల్ వ‌చ్చింది. `అత‌న్ని పేల్చేస్తా` (Will Blast Him) అని అందులో పేర్కొన్నార‌ని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌య‌ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన బెంగాల్‌పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు లోక్‌భ‌వ‌న్ వ‌ద్ద భ‌ద్ర‌త‌ను పెంచారు. ఇప్ప‌టికే ఆయ‌న జెడ్‌-ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్నారు. కాగా, గ‌వ‌ర్న‌ర్‌ ఆనంద‌బోస్‌ను చంపుతామంటూ బెదిరింపు రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో కూడా ఇలాంటి వార్నింగ్‌లు వ‌చ్చాయి. అయితే మెయిల్ ఎవ‌రు చేశారు?, ఎక్క‌డి నుంచి బెదిరింపు వ‌చ్చింద‌నే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాగా, బెంగాల్‌లో తాజాగా ఏర్ప‌డిన రాజకీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇలాంటి బెదిరింపు రావ‌డం గ‌మ‌నార్హం. బొగ్గు చోరీ స్కాంకు సంబంధించి రాజకీయ కన్సల్టెన్సీ 'ఐ ప్యాక్‌'పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దాడులు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. గురువారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు కోల్‌కతాలోని ఐ ప్యాక్ ఆఫీసుతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు జరిగాయి. అయితే ప్రతీక్ ఇంట్లో సోదాలు జ‌రుగుతుండ‌గానే సీఎం మమతా బెనర్జీ అక్క‌డి వెళ్లారు. రాజ‌కీయ క‌క్ష‌లో భాగంగానే ఈడీ దాడులు నిర్వ‌హిస్తున్న‌ద‌ని మ‌మ‌త ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కొంచం అదుపు చేయాల‌ని ప్ర‌ధాని మోదీకి సూచించారు. దీంతో బెంగాల్‌లో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది.

అయితే సీఎం మ‌మ‌త కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లారని ఈడీ ఆరోపించింది. ఐ ప్యాక్ ఆఫీసులోకీ సీఎం ప్రవేశించి డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా లాక్కొని వెళ్లారని పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement