త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | మిర్యాల‌గూడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జ‌రిగింది. శుక్రవారం తెల్లవారజామున‌ మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌర‌స్తా వద్ద మ‌లుపు తిరుగుతుండ‌గా సిమెంట్ ట్యాంక‌ర్‌ను డీసీఎం ఢీకొట్టింది.

G

Telangana | Published On Jan 9, 2026, 8.59 am IST

Road Accident | మిర్యాల‌గూడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం
Advertisement

trinethra.news: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జ‌రిగింది. శుక్రవారం తెల్లవారజామున‌ మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌర‌స్తా వద్ద మ‌లుపు తిరుగుతుండ‌గా సిమెంట్ ట్యాంక‌ర్‌ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

క్ష‌త‌గాత్రుల‌ను మిర్యాల‌గూడ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు. మృతుల‌ను కూలీలుగా గుర్తించారు. డీసీఎంలో టైల్స్‌ను హైద‌రాబాద్ నుంచి గుంటూరుకు త‌ర‌లిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగినట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌మాదానికి అతివేగ‌మే కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement