Gold ETF | బంగారం, వెండి ధరల పతనం ఎఫెక్ట్.. ఈటీఎఫ్‌లలో భారీ అమ్మకాలు..
Gold ETF | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడంతో దేశీయ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. శుక్రవారం గోల్డ్ ఈటీఎఫ్‌లు గరిష్ఠంగా 5.52 శాతం, సిల్వర్ ఈటీఎఫ్‌లు 6.50 శాతం వరకు పడిపోయాయి. అమెరికా డాలర్ బలపడడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు విలువైన లోహాలపై ఒత్తిడి పెంచాయి.
Gold ETF | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడంతో దేశీయ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. శుక్రవారం గోల్డ్ ఈటీఎఫ్‌లు గరిష్ఠంగా 5.52 శాతం, సిల్వర్ ఈటీఎఫ్‌లు 6.50 శాతం వరకు పడిపోయాయి. అమెరికా డాలర్ బలపడడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు విలువైన లోహాలపై ఒత్తిడి పెంచాయి.
బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో అమ్మకాల ఒత్తిడి..
బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 2.7 శాతం తగ్గి ఔన్సుకు 3,525.25 డాలర్లకు పడిపోయింది. సెప్టెంబర్ 2025 తర్వాత కనిష్ఠ స్థాయికి చేరడంతో 15 నెలల కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ వారంలో బంగారం ధర సుమారు 9.2 శాతం తగ్గే దిశగా పయనిస్తోంది. ఇది గత ఎనిమిది నెలల్లో అత్యంత భారీ వారపు పతనం కావడం గమనార్హం. దేశీయ ఈటీఎఫ్‌లలో ది వెల్త్ కంపెనీ గోల్డ్ ఈటీఎఫ్ 5.52 శాతం, యూనియన్ గోల్డ్ ఈటీఎఫ్ 5.47 శాతం, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ 5.42 శాతం నష్టపోయాయి. 360 వన్ గోల్డ్ ఈటీఎఫ్ 5.29 శాతం, బీఎన్‌పీ పారిబాస్ గోల్డ్ ఈటీఎఫ్ 5.16 శాతం పడిపోయాయి.
వెండి ఈటీఎఫ్‌లలో నష్టాలు మరింత ఎక్కువగా నమోదయ్యాయి. ఇన్వెస్కో ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ 6.50 శాతం, డీఎస్‌పీ సిల్వర్ ఈటీఎఫ్ 6.39 శాతం, యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 6.35 శాతం, కోటక్ సిల్వర్ ఈటీఎఫ్ 6.33 శాతం, మిరే అసెట్ సిల్వర్ ఈటీఎఫ్ 6.32 శాతం నష్టపోయాయి. బంగారం, వెండితోపాటు ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో విలువైన లోహాల ధరలను అనుసరించే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌పై అమ్మకాల ప్రభావం పడింది.
బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే అంచనాలు తాజా పతనానికి ప్రధాన కారణంగా మారాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫెడరల్ రిజర్వ్ అధికారులు చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచాయి. అధిక వడ్డీ రేట్ల వల్ల వడ్డీ ఆదాయం అందించని బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గుతుంది. మరోవైపు అమెరికా డాలర్ బలపడడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం కూడా బులియన్ మార్కెట్‌లపై ఒత్తిడి పెంచాయి. డాలర్ బలపడడంతో ఇతర కరెన్సీలు కలిగిన కొనుగోలుదారులకు బంగారం, వెండి కొనుగోలు మరింత ఖరీదుగా మారుతుంది. అయితే ధరలు తగ్గాయని పెట్టుబడిదారులు ఇప్పుడు పెట్టుబడులు పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం, వెండి ధరలు కొత్త గరిష్టాలను నమోదు చేస్తేనే మళ్లీ పెట్టుబడులకు అవకాశాలు ఉంటాయని, అప్పటి వరకు వేచి చూడాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు






